iDreamPost

పోలీసుల విచారణలో తప్పు ఒప్పుకున్న కేశవ! ఏమి చెప్పాడంటే?

బన్నీ-సుకుమార్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో అల్లు అర్జున్ కు స్నేహితుడిగా, నమ్మిన బంటుగా కేశవ పాత్రలో కనిపించాడు నటుడు జగదీష్ ప్రతాప్ బండారి. ఈ మూవీతో అతడికి మంచి పేరు వచ్చింది. అయితే ఓ కేసులో అతడు అరెస్టు అయ్యాడు..

బన్నీ-సుకుమార్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో అల్లు అర్జున్ కు స్నేహితుడిగా, నమ్మిన బంటుగా కేశవ పాత్రలో కనిపించాడు నటుడు జగదీష్ ప్రతాప్ బండారి. ఈ మూవీతో అతడికి మంచి పేరు వచ్చింది. అయితే ఓ కేసులో అతడు అరెస్టు అయ్యాడు..

పోలీసుల విచారణలో తప్పు ఒప్పుకున్న కేశవ! ఏమి చెప్పాడంటే?

పుష్ప సినిమా అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో అలరించాడు నటుడు జగదీష్ ప్రతాప్ బండారి. మల్లేశం మూవీ నుండి సినిమాల్లో ఉన్నా.. అతడికి పేరు తెచ్చింది మాత్రం బన్నీ-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీనే. ఈ మూవీతో పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆ తర్వాత సత్తి గానీ రెండు ఎకరాలు అనే ఓటీటీ మూవీలో హీరోగా నటించాడు. ఇప్పుడు పుష్ప2తో పాటు మరికొన్ని మూవీస్ చేస్తున్నాడు. అంతలో ఓ కేసులో అరెస్టు అయ్యాడు. జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య కేసులో ఈ నెల 6వ తేదీన జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మరో వ్యక్తితో ఉండగా.. ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

జగదీష్‌ను అరెస్టు చేసి అదే రోజు నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అలాగే అతడిని విచారించేందుకు రెండు రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కోరగా.. కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో అతడిని పోలీసులు విచారించగా.. తన నేరాన్ని అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తనతో ఉన్న మహిళ.. మరొకరితో చనువుగా, దగ్గరగా ఉండటం చూసి, భరించలేకపోయానని, తన దారికి తెచ్చుకునేందుకు మహిళకు ఫోటోలు చూపించి బెదిరించానని వెల్లడించాడట. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని తెలిపాడని సమాచారం. కేవలం ఆమెను తిరిగి దక్కించుకునే క్రమంలో ఇలా చేసినట్లు తెలిపాడట.

అసలు ఏమైందంటే..మహిళా జూనియర్ ఆర్టిస్టు, జగదీష్ ఎప్పటి నుండో స్నేహితులు. సినిమాలు చేయడం ప్రారంభించిన దగ్గరి నుండి వీరిద్దరూ లివిన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే జగదీష్ సినిమాలతో బిజీగా అయిపోవడం, ఆమెతో ఎక్కువ సేపు గడపలేకపోవడంతో వీరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. దీన్ని భరించలేని జగదీష్.. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి.. వాటిని ఆమెకు పంపి బెదిరించడం స్టార్ చేశాడు. దీంతో తనను అతడు బ్లాక్ మెయిల్ తట్టుకోలేక గత నెల 29న తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది జూనియర్ ఆర్టిస్ట్. దీంతో తన కుమార్తె చనిపోవడానికి జగదీష్ కారణమని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడి బెయిల్ కోసం పుష్ప టీం ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. మరీ అతడు చెప్పిన కారణాలు సమర్థనీయమని అంటారా.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి