iDreamPost

లగ్జరీ కారు కొన్న పుష్ప నటుడు! ధర తెలిస్తే షాకే..

  • Author Soma Sekhar Published - 09:18 AM, Sat - 26 August 23
  • Author Soma Sekhar Published - 09:18 AM, Sat - 26 August 23
లగ్జరీ కారు కొన్న పుష్ప నటుడు! ధర తెలిస్తే షాకే..

భారత ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ సినీ పురస్కారాలలో పుష్ప సినిమా సత్తా చాటింది. ఈ మూవీలో అద్భుతమైన నటనకు గాను.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. దీంతో పుష్ప టీమ్ మెుత్తం ఫుల్ ఖుషిగా ఉంది. ఈ క్రమంలోనే పుష్ప మూవీ నటుడు ‘ఫహద్ ఫాసిల్’మరో సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు. ఇతడు ఇటీవలే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాంతో ఈ సంతోషం మరింత సంతోషంగా మారింది. మరి ఆ లగ్జరీ కారు ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

‘పార్టీ లేదా పుష్పా’ ఈ డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ డైలాగ్ తో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఫహద్ ఫాసిల్. వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ.. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా.. ఫహద్ తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అతడు ‘ల్యాండ్ రోవర్’ కంపెనీకి చెందిన ‘డిఫెండర్’ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే తమ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ కారును కొనుగోలు చేశాడట ఫహద్. దీని ధర అక్షరాలా రూ. 2.11 కోట్లు(ఎక్స్-షోరూమ్).

కాగా.. డిఫెండర్ ఇండియన్ మార్కెట్ లో డిఫెండర్ 130, డిఫెండర్ 110 & 90 అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 వేరియంట్ 5.0 లీటర్ వి8 ఇంజన్ కలిగి 296 హార్స్ పవర్ & 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మరెన్నో అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది ఈ కారు. కాగా.. ఇప్పటికే ఫహద్ గ్యారేజిలో లంబోర్ఘిని ఉరస్, మినీ కంట్రీమ్యాన్, పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

ఇదికూడా చదవండి: బన్నీపై పోసాని కృష్ణమురళి ప్రశంసలు.. ఆస్కార్ కూడా వస్తుందంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి