iDreamPost

పూరి కొత్త బిజినెస్ ప్లాన్

పూరి కొత్త బిజినెస్ ప్లాన్

మన దేశంలో డిజిటల్ వీడియో విప్లవం మొదలై రెండు మూడేళ్లయినా కరోనా లాక్ డౌన్ వల్ల దీనికి ఎన్నడు లేని ఆదరణ ప్రస్తుతం దక్కుతోంది. థియేటర్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పాటు కొత్త సినిమాలు అందుబాటులో లేకపోవడంతో మూవీ లవర్స్ పూర్తిగా స్ట్రీమింగ్ యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఇది ఎంతగా పాకిందంటే ఏకంగా సుప్రసిద్ధ వెబ్ సైట్లు సైతం వెబ్ సిరీస్ లకు రివ్యూలు ఇచ్చేంత. ఇది తాత్కాలికమా లేక ప్రభావం ఎక్కువ కాలం కొనసాగుతుందా అంటే వెంటనే చెప్పలేం కానీ ప్రస్తుతానికి ట్రెండ్ అయితే జోరుగా నడుస్తోంది.

ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా యాప్ రూపంలో ఈ రంగంలోకి అడుగు పెట్టారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాల పోటీని తట్టుకుని నిలబడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సురేష్ బాబు, దిల్ రాజు లాంటి మరికొందరు కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్టు టాక్ ఉంది కానీ వాటికి సంబంధించిన క్లారిటీ మాత్రం లేదు. తాజాగా మరో క్రియేటివ్ దర్శకుడు సైతం ఈ ఫీల్డ్ పట్ల ఆసక్తి చూపుతున్నారట. ఆయనే పూరి జగన్నాధ్. ఇప్పటికే తన పేరు మీద ఉన్న బ్యానర్ తో ఛార్మీతో కలిసి సినిమాల నిర్మాణం చేస్తున్న పూరి త్వరలో వెబ్ ప్రొడక్షన్ లో దిగబోతున్నట్టు తెలిసింది.

దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఆఫీసు కూడా తీసుకున్నారని వినికిడి. త్వరలో ఓ పెద్ద స్టార్ హీరోతో గ్రాండ్ ఓపెనింగ్ చేయించే ప్లాన్ లో ఉన్నారట. అది అమితాబ్ బచ్చన్ కావొచ్చని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడీ టాక్ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. అయితే పూరి కంటెంట్ కోసం ఎలాంటి ప్లాన్ చేస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్(ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్న పూరి దీని తర్వాత ఏ హీరోకి కమిట్ కాలేదు. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ పూరి క్యాంప్ మాత్రం దీని గురించి సైలెంట్ గా ఉంది. లాక్ డౌన్ అయ్యాక ఫైటర్ కు సంబంధించిన బాలన్స్ వర్క్ చాలా ఉంది. ఈ ఏడాది విడుదలకు గట్టి ప్రయత్నమే చేస్తారట. ముంబైలో షూటింగ్ కి ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదు. మరి ఆ షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే తీస్తారా లేక ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి