iDreamPost

మహిళల కోసం అద్భుతమైన పథకం.. ఏకంగా రూ. 32 వేలు!

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాల వల్ల మహిళలు ఆర్థికంగా పలు ప్రయోజనాలను పొందుతున్నారు. ఇలాంటి పథకం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాల వల్ల మహిళలు ఆర్థికంగా పలు ప్రయోజనాలను పొందుతున్నారు. ఇలాంటి పథకం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.

మహిళల కోసం అద్భుతమైన పథకం.. ఏకంగా రూ. 32 వేలు!

పేద, మధ్యతరగతి మనుషుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొస్తుంటాయి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పలు పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు మహిళల కోసం అనేక స్కీమ్స్ తీసుకొచ్చాయి. ఇలాంటి పథకాల్లో మహిళలకు బాగా ఉపయోగపడే పథకం ఒకటి ఉంది. ద్వారా మహిళలు 32 వేలు పొందవచ్చు. ఆ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2023 ఏప్రిల్ 1న అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది బడ్జెట్ లో ఈ పథకాన్ని ప్రకటించారు.

ఇదొక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం. ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు. ఈ పథకంలో వెయ్యి రూపాయల నుంచి 2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టచ్చు. ఇతర స్మాల్ సేవింగ్స్ పథకాలతో పోలిస్తే ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా వస్తుంది. వార్షికంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. పైగా ఖచ్చిత లాభాలను పొందవచ్చు. ఈ పథకం రెండేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. మధ్యలో అవసరమైతే కొంత డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి వయసు పరిమితి లేదు. ఏ వయసులో అయినా అమ్మాయిల పేరు మీద గానీ మహిళల పేరు మీద గానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే పోస్టాఫీస్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయాలి.

మైనర్ అమ్మాయి మీద అయితే గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, కలర్ ఫోటో వంటి డాక్యుమెంట్స్ ఉండాలి. నిబంధనల ప్రకారం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీంలో పెట్టుబడి పెడితే ఏడాది తర్వాత కొంత డబ్బుని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తంలో 40 శాతం వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు 2 లక్షలు డిపాజిట్ చేస్తే కనుక.. అందులో మీరు 80 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో 50 వేలు పెట్టుబడి పెడితే.. రెండేళ్లలో రూ. 8,011 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 58,011 పొందుతారు.

ఒకవేళ లక్ష డిపాజిట్ చేస్తే.. వడ్డీ కింద రూ. 16,022 పొందుతారు. అంటే రెండేళ్ల తర్వాత మొత్తం రూ. 1,16,022 పొందవచ్చు. లక్షా 50 వేలు డిపాజిట్ చేస్తే.. రెండేళ్ల తర్వాత రూ. 24,033 వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 1,74,033 అందుతాయి. ఈ పథకంలో 2 లక్షలు పెట్టుబడి పెడితే 32,044 రూపాయలు వడ్డీ పొందుతారు. మెచ్యూరిటీ సమయానికి మొత్తం 2,32,044 రూపాయలు అందుకుంటారు. 2 లక్షలను బయట వ్యక్తులకు వడ్డీకి ఇస్తే తిరిగి ఇస్తారో లేదో తెలియదు. కానీ ఈ ప్రభుత్వ పథకంలో డిపాజిట్ చేస్తే మీ డబ్బుకి గ్యారంటీ ఉంటుంది. అయితే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే 2025 మార్చి 31 వరకే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి