iDreamPost

OTT Movies: OTT లో గత వారం టాప్ IMDB రేటింగ్ పొందిన సినిమాలను/ సిరీస్ లను మీరు చూశారా !

  • Published Apr 29, 2024 | 3:37 PMUpdated Apr 29, 2024 | 3:37 PM

ప్రతి వారం ఓటీటీ లోకి కొత్త సినిమాలు రావడం.. అవి కాస్త ముగించేసాక మరొక వారం కోసం ఎదురు చూడడం.. ఇలా జరుగుతూనే ఉంది. అయితే గత వారం ఎన్నో సినిమాలు ఓటీటీ లోకి వచ్చేశాయి. మరి వాటిలో ఈ టాప్ రేటెడ్ సినిమాలను మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

ప్రతి వారం ఓటీటీ లోకి కొత్త సినిమాలు రావడం.. అవి కాస్త ముగించేసాక మరొక వారం కోసం ఎదురు చూడడం.. ఇలా జరుగుతూనే ఉంది. అయితే గత వారం ఎన్నో సినిమాలు ఓటీటీ లోకి వచ్చేశాయి. మరి వాటిలో ఈ టాప్ రేటెడ్ సినిమాలను మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Apr 29, 2024 | 3:37 PMUpdated Apr 29, 2024 | 3:37 PM
OTT Movies: OTT లో గత వారం టాప్ IMDB  రేటింగ్ పొందిన సినిమాలను/ సిరీస్ లను మీరు చూశారా !

చూసే తీరిక, ఓపిక ఉండాలి కానీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో లెక్కలేనన్ని సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. వారానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసేయొచ్చు. కానీ, ఇప్పుడు ప్రతి వారం పదికి పైగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీనితో కొన్ని సినిమాలను చూస్తున్నారు మరి కొన్ని సినిమాలను మిస్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. గత వారం రిలీజ్ అయినా సినిమాలలో ఈ సినిమాలను కానీ మిస్ అయ్యి ఉంటె.. టాప్ రేటెడ్ మూవీస్ ని మిస్ అయినట్లే. ఎందుకంటే వాటిలో మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి.. ఏ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉన్నాయి. అనే విషయాలను చూసేద్దాం.

గత వారం నెట్ ఫ్లిక్స్ , హాట్ స్టార్, లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చిన టాప్ రేటెడ్ మూవీస్ లిస్ట్ లో.. మీరు మిస్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయేమో ఓ లుక్ వేసేయండి.

హాట్ స్టార్ లో మంచి రేటింగ్ పొందిన సినిమాలు/ సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1. థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ సిరీస్)

ఈ సిరీస్ పేరు ” థ్యాంక్యూ.. గుడ్ నెట్ ది బోన్ జోవి స్టోరీ”. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ.. బోన్ జోవి అనే ఒక ఐకానిక్ మ్యూజిక్ బ్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంటరీనే ఈ సిరీస్. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సిరీస్ 7.7 రేటింగ్ దక్కించుకుంది. ఇది 1980 నుండి ఇప్పటి వరకు అమెరికన్ బ్యాండ్ యొక్క జర్నీ ఎలా సాగింది అనే విషయాలన్నింటిని.. ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. కాబట్టి మ్యూజిక్ లవర్స్ కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది చెప్పడంలో… ఏ మాత్రం సందేహం లేదు.

నెట్ ఫ్లిక్స్ లో మంచి రేటింగ్ పొందిన సినిమాలు/ సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1. డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్):

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక మనిషి చనిపోయిన తర్వాత.. అతడు ఎక్కడికి వెళ్తాడు.. ఒకవేళ వేరే లోకానికి వెళ్తే అక్కడ అతని లాంటి మనుషులే ఎదురైతే.. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి! అసలు నిజంగానే మనిషి చనిపోయిన తర్వాత వేరే లోకానికి వెళ్తాడా! ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.. కామెడీ, సస్పెన్స్, హర్రర్ ఈ మూడు జోనర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ఒక్క సిరీస్ తో.. ఫుల్ ఎంటెర్టైనేమేంట్ లభించేస్తుంది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమాకు 7.5 రేటింగ్ దక్కించుకుంది.

2. టిల్లు స్క్వేర్ (తెలుగు సినిమా):
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ వీకెండ్ అందరూ చూసేసి ఉంటారు. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఇందులో వచ్చే ట్విస్ట్ లకు అందరు ఆశ్చర్యపోక తప్పదు. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా.. 7.1 రేటింగ్ దక్కించుకుంది.

3.ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్):
ఇది ఒక స్పానిష్ సిరీస్. ఈ సిరీస్ మొత్తం కూడా.. ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీసుకుని రూపొందించారు. 2013 లో జరిగిన 12 సంవత్సరాల చిన్న పాప మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడమే ఈ సిరీస్ సారాంశం. ఇన్వెస్టిగేషన్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ను మెచ్చే ప్రేక్షకులకు ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సిరీస్ 7.1 రేటింగ్ దక్కించుకుంది.

సో ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో టాప్ రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమాలను, సిరీస్ లను కనుక మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి