iDreamPost

ప్రేయసి కోసం అమ్మాయి గెటప్‌లో పరీక్షకు.. ఎలా దొరికిపోయాడంటే?

ప్రేమ అనే రెండు అక్షరాల పదం మనిషి.. అనేక తిప్పలు పెడుతుంది. ఆ ప్రేమ మైకంలో పడిన కొందరు.. తాము చేసేది తప్పాఒప్పా అనే కనీస ఆలోచనతో ఉండరు. ఈ క్రమంలోనే తన లవర్ కోసం చేసే కొన్ని పనులు వీరిని చిక్కుల్లో పడేలా చేస్తాయి. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ప్రేమ అనే రెండు అక్షరాల పదం మనిషి.. అనేక తిప్పలు పెడుతుంది. ఆ ప్రేమ మైకంలో పడిన కొందరు.. తాము చేసేది తప్పాఒప్పా అనే కనీస ఆలోచనతో ఉండరు. ఈ క్రమంలోనే తన లవర్ కోసం చేసే కొన్ని పనులు వీరిని చిక్కుల్లో పడేలా చేస్తాయి. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ప్రేయసి కోసం అమ్మాయి గెటప్‌లో పరీక్షకు.. ఎలా దొరికిపోయాడంటే?

ప్రేమ అనేది చాలా విచిత్రమైనది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే..ఈ ప్రేమ మైకంలో కొందరు ప్రవర్తించే తీరు చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా తమ లవర్ కోసం ఏ త్యాగం చేయడానికైన సిద్ధం అన్నట్లు నేటి కాలం యువకులు మారిపోయారు. అంతేకాక ప్రేమ ఎంతో గొప్పదని తెగ ఫీల్ అయిపోతుంటారు. అయితే కొన్ని సార్లు తన ప్రియురాలి కోసం కొందరు చేసే అతి పనులు..వారిని చిక్కుల్లో పడేస్తాయి. తాజాగా ఓ యువకుడు తన లవర్ కోసం అమ్మాయిగా మారి పరీక్షకు వెళ్లాడు. ఆ తరువాత అతడి  ఎదురైన పరిస్థితి చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి.. అసలు ఏం  జరిగింది. ఎక్కడ జరిగింది?.  ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పంజాబ్ రాష్ట్రంలో జనవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ .. ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలకి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అలానే అధికారులు కూడా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. ఇక ఈ పరీక్షలకు ఫజిల్కా  పరంజిత్ కౌర్ అనే యువతి హాజరు  కావాల్సి ఉంది. అయితే తన లవర్ కి ఎలాగైన ఉద్యోగం రావాలని పరంజిత్ కౌర్ ప్రియుడు ఓ కన్నింగ్ ఐడియా వేశాడు.  అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు పరంజిత్  కౌర్ లవర్. వీరిద్దరు చాలా ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక ఈ ఆరోగ్య సిబ్బంది పరీక్షల్లో పరంజిత్ కౌర్ కి బదులు అంగ్రేజ్ సింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు సిద్దమయ్యాడు. ఇక అమ్మాయిల వస్త్రాధరణతో సింగ్ పరీక్ష హాల్ కు వెళ్లాడు.

ఇక ఎక్కడ దొరికిపోకుండా.. అతడు అన్ని ఫేక్ ఫ్రూప్ లతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష కేంద్రంలో అదికారులు ఫ్రూఫ్ లు అడగా  పరంజిత్ కౌర్ పేరుతో సృష్టించిన ఫేక్ ఓటర్ ఐడీ, ఆధార్ కార్డును వాళ్లకు చూపించాడు. అయితే విధి అతన్ని తప్పించుకోనివ్వలేదు. ఈ ఫ్రూప్ తనిఖీ అనంతరం బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. ఆ బయోమెట్రిక్  డివైస్ దగ్గర ఆయన అడ్డంగా దొరికిపోయాడు. దీంతో యువతి దరఖాస్తు ఫారమ్ ను అధికారులు తిరష్కరించారు. అంతేకాక ఆమెను  పరీక్షలకు అనర్హులిగా ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇంక అమ్మాయిలా వేషం వేసుకుని  అంగ్రేజ్ సింగ్ పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక అతనిపై చర్యకు యునివర్సిటీ  అధికారులు సిద్ధమవుతున్నారు. మరి… ప్రేయసి పరీక్ష కోసం ఇలా అడ్డంగా బుక్కైన ఈ యువకుడి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి