iDreamPost
android-app
ios-app

మరో ఓటీటీలోకి మమ్ముట్టి సైకలాజికల్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే

  • Published Mar 02, 2024 | 8:58 AM Updated Updated Mar 02, 2024 | 8:58 AM

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ అబ్రహాం ఓజ్లర్ ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ కి అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ అబ్రహాం ఓజ్లర్ ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ కి అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Published Mar 02, 2024 | 8:58 AMUpdated Mar 02, 2024 | 8:58 AM
మరో ఓటీటీలోకి మమ్ముట్టి సైకలాజికల్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా మాలీవుడ్ ట్రెండ్ నడుస్తోంది. అక్కడ థియేటర్లలో విడుదలైన వివిధ జోన్ సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో ఓటీటీలో విడుదలైన మలయాళీ మూవీస్ కు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో పాటు దూసుకుపోతున్నాయి. ఇటీవలే ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాని తెలుగులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక ఇప్పుడు మరో హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమానే అబ్రహాం ఓజ్లర్. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రలు పోషించారు. అయితే , గతంలో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ అయ్యింది. కానీ, ఇప్పుడు మరోక ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకి ఎక్కడంటే..

మలయాళ సూపర్ డుపర్ హిట్ మూవీ అయిన అబ్రహాం ఓజ్లర్ ఈ మూవీ గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కాగా, ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు.అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. ఈ క్రమంలోనే ఏకంగా రూ.40 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలరించగా.. మళ్లీ ఇప్పుడు మరో ఓటీటీలో అలరించనుంది. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల అనగా మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా, ఈ విషయాన్ని ఆ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే అబ్రహాం ఓజ్లర్ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమాలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్ కీలకపాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అబ్రహం (జయరాం) భార్య పిల్లలను కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. అయితే వారు ఎవరికి కనిపించకుండా పోయినా తన దగ్గరే ఉన్నట్లు అబ్రహం ఊహించుకుంటాడు. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతుంటారు. అయితే మృతిచెందిన వారి వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసిన పేపర్లు దొరుకుతాయి. అయితే వారిని చంపిందెవరు ? ఈ సినిమా లో అలెక్స్ (మమ్ముట్టి) కిల్లర్ గా మారడానికి కారణమేంటీ ? అబ్రహం భార్య పిల్లలు ఏమయ్యారు ? అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా ఓటీటీలో అబ్రహాం ఓజ్లర్  చూడాల్సిందే. మరి, అబ్రహాం ఓజ్లర్ సినిమా మరికొన్ని రోజుల్లో మరో ఓటీటీలోకి రాబోతుండం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş