iDreamPost

వీడియో: కెమెరాను చూసి జడుసుకున్న బాబర్ ఆజం.. భయంతో పరిగెడుతూ..!

  • Published Mar 14, 2024 | 5:58 PMUpdated Mar 14, 2024 | 5:58 PM

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అతడు ఓ కెమెరాను చూసి జడుసుకోవడం ఇప్పుడు వైరల్​గా మారింది.

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అతడు ఓ కెమెరాను చూసి జడుసుకోవడం ఇప్పుడు వైరల్​గా మారింది.

  • Published Mar 14, 2024 | 5:58 PMUpdated Mar 14, 2024 | 5:58 PM
వీడియో: కెమెరాను చూసి జడుసుకున్న బాబర్ ఆజం.. భయంతో పరిగెడుతూ..!

క్రికెటర్లకు సంబంధించిన బ్యాటింగ్ విన్యాసాలు, బౌలింగ్, ఫీల్డింగ్ మెరుపులే కాదు.. వాళ్ల ఫన్నీ వీడియోస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. బ్యాటింగ్, ఫీల్డింగ్ టైమ్​లో చేసే కొన్ని పొరపాట్లు, అనివార్య విషయాలు ఒక్కోసారి అందరికీ నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇలాంటివి మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంటాయి. వీటికి వ్యూస్ కూడా భారీగా వస్తుంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఇలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయడం, వీటి మీద మీమ్స్ లాంటివి తయారు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్​మన్ బాబర్ ఆజం కెమెరాను చూసి భయపడ్డాడు. బ్యాటింగ్ ద్వారానో లేదా ఇతర విషయాల ద్వారా వైరల్ అయ్యే బాబర్ ఇప్పుడు ఈ వీడియోతో నెట్టింట హల్​చల్ చేస్తున్నాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్​-2024లో భాగంగా పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ టీమ్స్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో ఫీల్డింగ్ సమయంలో స్పైడర్ కెమెరాను చూసి ఉలిక్కిపడ్డాడు బాబర్. కెమెరా తన పక్క నుంచే రోల్ అవుతున్నా అతడు గమనించలేదు. పెషావర్ కెప్టెన్​గా ఉన్న బాబర్ జట్టు బౌలర్​తో ఏదో డిస్కస్ చేస్తూ కనిపించాడు. ఫీల్డ్ సెట్టింగ్​ గురించి చర్చిస్తూ ఉండగా సడన్​గా అతడి పక్క నుంచి కెమెరా దూసుకెళ్లింది. అంతే తన మీద ఏదో పడ్డట్టు వణికిపోయాడు బాబర్. దాని నుంచి తప్పించుకునేందుకు కిందకు వంగి దూరంగా పరిగెత్తాడు. అది మరేదో కాదు.. కెమెరా అని తెలియడంతో కోలుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న బౌలర్ గానీ ప్రత్యర్థి జట్టు బ్యాటర్ గానీ అతడికి ఏమీ కాదని భరోసా ఇవ్వకుండా చూస్తూ ఉండిపోవడం గమనార్హం.

బాబర్ కెమెరాను చూసి భయపడటం, వెనక్కి పరిగెత్తిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. పాపం బాబర్, చిన్న పిల్లాడిలా భయపడ్డాడు అని కామెంట్స్ చేస్తున్నారు. పాక్ క్రికెటర్లు అంతే.. అంతే అని అంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కరాచీ కింగ్స్ అన్ని ఓవర్లు ఆడి 5 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసింది. కేవలం 2 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది కరాచీ. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న బాబర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డును సొంతం చేసుకున్నాడు. మరి.. బాబర్ ఫన్నీ వీడియో మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి