iDreamPost

దేశం పేరు మార్పు వెనుక అసలు ఉద్దేశం ఇదే: ప్రొఫెసర్‌ హరగోపాల్‌

  • Published Sep 06, 2023 | 1:09 PMUpdated Sep 06, 2023 | 1:09 PM
  • Published Sep 06, 2023 | 1:09 PMUpdated Sep 06, 2023 | 1:09 PM
దేశం పేరు మార్పు వెనుక అసలు ఉద్దేశం ఇదే: ప్రొఫెసర్‌ హరగోపాల్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న అంశం.. ‘ఇండియా’ పేరును అధికారికంగా ‘భారత్‌’ అని మార్చి, ప్రపంచ దేశాలు సైతం ఇకపై మన దేశాన్ని ‘భారత్‌’గానే గుర్తించేలా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టడంపై జరుగుతుంది. దీంతో కొంతమంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. అసలు బీజేపీ ప్రభుత్వం ఉన్నపళంగా దేశం పేరును మార్చేందుకు వెనుక ఉన్న ఉద్దేశం ఇదే అంటూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

బీజేపీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తోపాటు దేశంలోని పలు ప్రముఖ పార్టీలన్నీ కలిసి కుటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌, డీఎంకే, తృణముల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, ఎస్పీపీ, జేడీయూ, సమాజ్ వాదీ ఇలా మరికొన్ని పార్టీలన్నీ జట్టు కట్టాయి. ఈ కూటమికి INDIA అనే షార్ట్‌ నేమ్‌ వచ్చేలా Indian National Developmental Inclusive Alliance(INDIA) అని పెట్టకున్నారు. ఈ ఎన్నికలు ఇండియాకి బీజేపీ అంటూ ప్రచారం కూడా మొదలెట్టాయి. దీంతో ఆ కూటమికి మద్దుత పెరుగుతుందని బీజేపీ భయపడినట్లు కనిపిస్తుందని హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు.

ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమి ఇండియా అనే పేరు పెట్టుకోవడంతో దేశం పేరు మారిస్తే ఇండియా వైపు ఉంటారా భారత్‌ వైపు ఉంటారా అనే అనవసరపు చర్చకు దారి తీశారని, దేశంలో చాలా సమస్యలు ఉన్నా కూడా, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదస్పద అంశం లేవనెత్తడం చేస్తుందని అన్నారు. నిజానికి భారత్‌ కంటే కూడా ఇండియా పేరే సముచితంగా ఉంటుందని, భరతుడు పాలించాడు కనుక భారత్‌ అనిపెట్టుకుంటే రాజరిక వ్యవస్థను ప్రొత్సహించినట్లు అవుతుందని, ఇండియా అనే పేరు మన ఇండియస్‌ వ్యాలీ, సింధు నాగరికతకు దగ్గరగా ఉంటే పదం అని అన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మన దేశం పేరు మారబోతోందా? కేంద్రం కొత్త ఆలోచన!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి