iDreamPost

Hero Shivakarthikeyan:కష్టాల్లో నిర్మాతలు.. రెమ్యూనరేషన్ వదులుకున్న హీరో!

  • Published Dec 28, 2023 | 6:47 PMUpdated Dec 28, 2023 | 6:47 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి అందరికి తెలిసిందే. అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు కార్తికేయన్. అయితే తాజాగా ఈ యాంగ్ హీరోకి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఆయన చేసిన పనికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. అదేమిటంటే..

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి అందరికి తెలిసిందే. అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు కార్తికేయన్. అయితే తాజాగా ఈ యాంగ్ హీరోకి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఆయన చేసిన పనికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. అదేమిటంటే..

  • Published Dec 28, 2023 | 6:47 PMUpdated Dec 28, 2023 | 6:47 PM
Hero Shivakarthikeyan:కష్టాల్లో నిర్మాతలు.. రెమ్యూనరేషన్ వదులుకున్న హీరో!

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి అందరికి తెలిసిందే. పేరుకి తమిళ నటుడు అయిన అటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు కార్తికేయన్. అలాగే ఆయన నటించిన రెమో, డాన్, డాక్టర్ వరుణ్ లు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో తెలుగులో కూడా శివకార్తికేయన్‌ కు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఎన్నో విభిన్న పాత్రల్లో అలరిస్తూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈయన కేరీర్ ప్రారంభంలో రేడియో జాకీ నుంచి నేడు స్టార్ హీరోగా ఎదిగారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన శివ కార్తికేయన్ లైఫ్ జర్నీ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఒక ధృడ సంకల్పంతో పనిచేస్తే.. అసాధ్యం కానీవి కూడా సాధ్యం అవుతాయనేందుకు శివ కార్తికేయన్ జీవితమే ఉదాహరణ. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కోలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్స్ లో ఒకరిగా నిలిచారు. అయితే తాజాగా శివ కార్తికేయన్ కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

యాంగ్ హీరో శివ కార్తికేయన్ గురించి ఇప్పుడు తమిళనాట చర్చంశనీయంగా మారింది. ఆయన చేసిన పనికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. సహజంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సినిమాలతో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ భారీగా పుచ్చుకుంటారు. కానీ, కొంతమంది హీరోలు మాత్రం సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలకు అండగా నిలబడి వారు నష్టపోకూడదని రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తారు. ఇప్పటికే ఇదే తరహలో మన తెలుగు హీరోలు చాలామంది ఉన్నారు. కాగా, కొంతమంది హీరోలు మాత్రం నిర్మాత నష్టపోకూడదని ఏకాంగా రెమ్యునరేషన్ లేకుండా సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా శివ కార్తికేయన్ కూడా అదే పని చేస్తున్నారు. ఓ నిర్మాతకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా ఆయన ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘అయలాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఈ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇక ‘అయలాన్’ సినిమాలో కార్తికేయన్ ఓ ఏలియన్ తో స్నేహం చేయనున్నాడు. అలాగే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించారు.

ఇక ఆ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ..’ఈ సినిమాలో హింసాత్మక సంఘటనలు గానీ, తుపాకీ శబ్దాలు గానీ, అశ్లీల సన్నివేశాలు గానీ ఉండవని తెలిపారు. అలాగే ఈ సినిమా తమిళనాట ముఖ్యమైన సినిమాగా మిగిలిపోతుందని అన్నారు. కాగా అయలాన్ సినిమా నిర్మాణ సమయంలో.. చిత్ర నిర్మాత చాలా సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. అందుకే తాను కూడా ఈ మూవీ విషయంలో రెమ్యునరేషన్ తీసుకోలేదని పేర్కొన్నాడు. కాగా, రెమ్యునరేషన్ అవ్వకపోయినా పర్వలేదు కానీ, సినిమాను మాత్రం ఎలాగైనా పూర్తి చేయమని చెప్పేనన్నారు. ఇక సినిమా ఇక ఈ సినిమా టీజర్ కంటే ట్రైలర్ అదిరిపోతుందని’ శివకార్తికేయన్ తెలిపారు. అలాగే 2024 జనవరి 5వ తేదిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరి, శివ కార్తికేయన్ చేసిన గొప్ప పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి