iDreamPost

గ్రౌండ్ లో ధోని, కోహ్లీ ముచ్చట్లు! ఇది కదా సలార్ స్నేహమంటే!

MS Dhoni- Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 తొలి మ్యాచ్ ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ- ఎంఎస్ ధోనీ మధ్య అద్భుతమైన సంఘటన ఆవిష్కృతమైంది. ఫ్యాన్స్ అంతా అది చూసి ఉబ్బితబ్బిబ్బై పోయారు.

MS Dhoni- Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 తొలి మ్యాచ్ ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ- ఎంఎస్ ధోనీ మధ్య అద్భుతమైన సంఘటన ఆవిష్కృతమైంది. ఫ్యాన్స్ అంతా అది చూసి ఉబ్బితబ్బిబ్బై పోయారు.

గ్రౌండ్ లో ధోని, కోహ్లీ ముచ్చట్లు! ఇది కదా సలార్ స్నేహమంటే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైపోయింది. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో చెన్నై వేదికగా తొలి మ్యాచ్. ప్రత్యర్థులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం. అందరూ ఈ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఎంతోకాలం తర్వాత ధోనీ మైదానంలోకి దిగి మెరుపులు మెరిపిస్తాడని.. కీపింగ్ లో తనదైన మార్క్ చూపిస్తాడని ఎదురుచూస్తున్న సదరు క్రికెట్ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలాగే కింగ్ కోహ్లీ మరోసారి పరుగుల వరద పారించాలని కోరుకుంటున్న వాళ్లు కూడా ఎంతో మందే ఉన్నారు. అయితే వీళ్లిద్దరినీ ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులుగానే చూడక తప్పదు. అది నచ్చని వాళ్లు కూడా చాలానే ఉంటారు. అయితే వాళ్లు పేరుకో ప్రత్యర్థులు అనడానికి ఒక ఆసక్తికర విషయం అయితే మ్యాచ్ లో జరిగింది.

సాధారణంగా జెంటిల్ మన్ క్రికెట్ లో ప్రాక్టీస్ టైమ్ లో ఆ జట్టు సభ్యులతో ఈ జట్టు సభ్యులు మాట్లాడటం, సరదాగా గడపడం చూస్తూ ఉంటాం. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మాత్రం ప్రత్యర్థులుగా మారిపోతారు. నీపై నాదే విజయం అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కోహ్లీ- ధోనీ మాత్రం అందుకు భిన్నంగా కనిపించారు. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మైదానంలోకి దిగిన డుప్లెసిస్, కోహ్లీ చెన్నై బౌలర్లపై విరుచుకు పడ్డారు. కోహ్లీ డిఫెన్స్ ఆడుతుంటే డుప్లెసిస్ మాత్రం చెలరేగిపోయాడు. వచ్చిన ప్రతి బౌలర్ పై విజృంభించాడు. డుప్లెసిస్ మొత్తం 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు ఉన్నాయి. తర్వాత ముస్తాఫిజుర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు.

అందరూ కోహ్లీ ఎప్పుడు విరుచుకుపడతాడు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఓవర్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ అదర్ ఎండ్ కు వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. పక్కనే ఉన్న ధోనీ భుజం మీద చెయ్యేసి నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు. ధోనీ కూడా కోహ్లీని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్ కి సంబంధించిన వార్తలు కంటే ఈ పిక్సే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఇది కదా మేము కోరుకుంది, ఈ మూమొంట్ కోసం కదా ఇన్నాళ్లు వెయిట్ చేస్తున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ధోనీ- కోహ్లీ కలిసి మైదానంలో కనిపించి ఎన్నాళ్లు అవుతుందో కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ తో తమ కోరిక తీర్చారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఇద్దరూ పేరుకు మాత్రమే ప్రత్యర్థులు.. కానీ, ప్రాణ స్నేహితులు అంటూ పొంగి పోతున్నారు. ధోనీ అంటే కోహ్లీకి ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మధ్య ఉండే కల్మషంలేని స్నేహం ఆ ఫొటోల్లో, వారి నవ్వుల్లో కనిపిస్తూనే ఉంది. మరి.. ధోనీ- కోహ్లీ మధ్య జరిగిన ఈ మూమొంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి