iDreamPost

వీడియో: బాబోయ్.. వంట చేస్తుండగా పేలిన ప్రెషర్ కుక్కర్.. తర్వాత..

సాధారణంగా ఇంట్లో ఉండే కొన్ని పరికరాలు ఎంత బాగా ఉపయోగపడాయో.. అంతే ప్రమాదం అని గమనించారు. రిఫ్రిజిరేటర్, గ్యాస్ సిలిండర్, ప్రెషర్ కుక్కర్, కొన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు హఠాత్తుగా పేలిపోతుంటాయి.

సాధారణంగా ఇంట్లో ఉండే కొన్ని పరికరాలు ఎంత బాగా ఉపయోగపడాయో.. అంతే ప్రమాదం అని గమనించారు. రిఫ్రిజిరేటర్, గ్యాస్ సిలిండర్, ప్రెషర్ కుక్కర్, కొన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు హఠాత్తుగా పేలిపోతుంటాయి.

వీడియో: బాబోయ్.. వంట చేస్తుండగా పేలిన ప్రెషర్ కుక్కర్.. తర్వాత..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా జరిగే పరిణాలు చూసి షాక్ తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో వాడే వస్తువుల వల్ల కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు పొంచి ఉంటాయి. గతంలో గ్యాస్ సిలిండర్, రిఫ్రిజిరేటర్, ప్రెషర్ కుక్కర్ హఠాత్తుగా పేలి భారీ ఆస్తి నష్టమే కాదు.. ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి ఇంట్లో ఫైర్ సేఫ్టీ ఉండాలని అంటుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ప్రెషర్ కుక్కర్ పేలుడుకి సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు మహిళలు వంటగదిలో పని చేస్తున్నారు. గ్యాస్ పై ఉంచిన ప్రెషర్ కుక్కర్ కనిపిస్తుంది. ఓ బాలుడు అక్కడ టేబుల్ పక్కన ఆడుకుంటున్నాడు. అంతలోనే ఒక్కసారిగా కుక్కర్ పేలి పై కప్పు ఎగిరిపోయింది. వంట గది మొత్తం పొగతో నిండిపోయింది. అక్కడ ఉన్న మహిళలకు ఏం జరిగిందో అర్థం షాక్ తిన్నారు.  గ్యాస్ ఎక్కువ కావండంతో ఒత్తికిడి గురై ప్రెషర్ కుక్కర్ పేలి ఉంటుందని అంటున్నారు. పేలుడు ధాటికి వంటిల్లు మొత్తం చిందరవందరగా మారిపోయింది. పేలుడు శబ్ధం విని తమ ప్రాణాలు కాపాడుకునేందు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు.

ఈ ఘటన పంజాబ్ లోని పాటియాలలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తితో పాటు బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. బహుషా ప్రెషర్ కుక్కర్ కి సంబందించిన విజిల్, రబ్బర్ ని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగి ఉండవొచ్చని కొందరు అంటే.. సామర్థ్యం కన్నా ఎక్కువ ఉడికించి ఉంటారని, ఎక్కువ నీళ్లు పోసి ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రెషర్ కుక్కర్ వాడేవాళ్లు అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి