iDreamPost

రాజ్యసభకు నామినేట్ అయిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

రాజ్యసభకు నామినేట్ అయిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రపతి కోటాలోని నామినేటెడ్ సభ్యులలో ఒక రాజ్యసభ సభ్యుడు పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి రంజన్ గొగోయిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌కు నామినేట్ చేసినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

గత ఏడాది నవంబర్‌లో జస్టిస్ గొగోయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.భారత రాజకీయాలలో అత్యంత కీలక సున్నితమైన అయోధ్య భూ వివాదంలో దశాబ్దాల వివాదానికి తెరదించుతూ ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన తీర్పు ఇచ్చారు.46 వ సిజెఐగా అక్టోబర్ 3, 2018 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ 13 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి