iDreamPost

రాజ్యసభ మూడు స్థానాలను కైవసం చేసుకున్నYSRCP

Rajya Sabha,YSRCP: రాజ్యసభలో వైసీపీ రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థులుగా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

Rajya Sabha,YSRCP: రాజ్యసభలో వైసీపీ రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థులుగా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

రాజ్యసభ మూడు స్థానాలను కైవసం చేసుకున్నYSRCP

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ సీపీ అరుదైన రికార్డును సాధించింది. ఏపీ నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన మూడు స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. ఇప్పటికే వారి విజయం దాదాపు కన్ఫామ్ కాగా తాజాగా ఏకగ్రీవంగా గెలిచినట్లు కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల అధికారుల నుంచి ఎంపీలు డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నారు. మొత్తంగా ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరింది. ఇదే సమయంలో వైసీపీ ఓ అరుదైన రికార్డును అందుకుంది.

ఇటీవలే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయినా 56 స్థానాలకు  కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి  మూడు స్థానాల చొప్పున ఖాళీ అయ్యాయి. ఏపీలో వైసీపీ, బీజేపీ, టీడీపీ తరపున ఉన్న ఎంపీల పదవికాలం ముగిసింది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం త్వరలో ముగినుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యబలాల దృష్టా వైసీపీ ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే తనకు బలం లేకపోయిన పోటీ నిలిపే ప్రయత్నం చంద్రబాబు చేశారు. అయితే ఆయన ఓటుకు నోటు రాజకీయాలు ఏపీలో పనిచేయకపోవడంతో.. అభ్యర్థిని నిలబెట్టలేదని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తరపున ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ తిరష్కరణకు గురికావడంతో వైసీపీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. అయితే తాజాగా ఎన్నికల కమిషన్ అధికారికంగా వారి ఎన్నికను అధికారికను ప్రకటించింది.  దీంతో మొత్తం ఏపీ తరపున ఉన్న 11 రాజ్యసభ స్థానాలను వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాక అరుదైన ఓ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ , విభాజిత ఏపీలో కానీ రాజ్యసభ స్థానాలన్నీ ఒకే పార్టీకి దక్కడం జరగలేదు. ఇప్పుడు ఆ రికార్డును వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మొత్తంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే రికార్డులను సొంతం చేసుకున్నారు. మరి.. తాజాగా వైఎస్సార్ సీపీ పొందిన అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి