iDreamPost

Salaar Meaning: ప్రభాస్ సలార్ టైటిల్ కి అర్థం ఏంటో తెలుసా.. ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడంటే

  • Published Dec 23, 2023 | 12:07 PMUpdated Dec 29, 2023 | 5:06 PM

Salaar Meaning in Telugu: ఈమధ్య కాలంలో భారీ అంచనాలు నెలకొన్ని ఉన్న చిత్రం ఏదంటే టక్కున వినిపించే పేరు సలార్. డిసెండర్ 22న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరి ఇంతకు సలార్ అంటే అర్థమేంటి..

Salaar Meaning in Telugu: ఈమధ్య కాలంలో భారీ అంచనాలు నెలకొన్ని ఉన్న చిత్రం ఏదంటే టక్కున వినిపించే పేరు సలార్. డిసెండర్ 22న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరి ఇంతకు సలార్ అంటే అర్థమేంటి..

  • Published Dec 23, 2023 | 12:07 PMUpdated Dec 29, 2023 | 5:06 PM
Salaar Meaning: ప్రభాస్ సలార్ టైటిల్ కి అర్థం ఏంటో తెలుసా.. ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడంటే

మరి కొన్ని రోజుల్లో.. 2023కి గుడ్ బై చెప్పబోతున్నాం. అయితే ఏడాది చివర్లో.. బాక్సాఫీస్ మోత మోగిపోతుంది. ప్రభాస్ లాంటి డైనోసర్ వస్తే.. అలానే ఉంటుంది కదా అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే వారు ఎంతో కాలంగా.. ఆత్రుతగా ఎదురు చూసిన సలార్ సినిమా.. డిసెండర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సలార్ దెబ్బకు షారుక్ ఖాన్.. డంకీ సినిమా బాక్సాఫీస్  రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తొలి రోజు సలార్ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

సలార్ సినిమాలో.. ప్రభాస్ తన మాస్ యాక్షన్ తో ప్రేక్షకులకు పూనకాలు రప్పించాడు. డార్లింగ్ తో పాటు శ్రుతీ హాసన్, పృథ్వీరాజ్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి వంటి వార్లు.. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే తాజాగా రిలీజైంది పార్ట్ 1. రెండో భాగానికి సంబంధించి ప్రశాంత్ నీల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నెటిజనులు సలార్ టైటిల్ అర్థం ఏంటి అని తెగ వెతుకుతున్నారంట. పేరు భిన్నంగా ఉంది కదా.. ఇది ఏ భాషా పదం.. దీని మీనింగ్ ఏంటి అని ఆరా తీస్తున్నారట. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్.. అర్థం ఏంటో చెప్పేశాడు.

what is meaning of salar

సలార్ అంటే అర్థం ఇదే..

అయితే సలార్ టైటిల్ కి అర్థాన్ని రివీల్ చేశారు దర్శకుడు ప్రశాంత్​ నీల్. సలార్‌ అనేది ఓ ఉర్దూ పదమని ఆయన తెలిపారు. ఈ పదానికి అర్థం సమర్థవంతుడైన నాయకుడని అన్నారు. ఒక రాజుకు కుడిభుజంగా ఉంటూ.. అత్యంత నమ్మదగిన  వ్యక్తిని సలార్ అని పిలుస్తారంటూ ప్రశాంత్ నీల్​ చెప్పుకొచ్చాడు. ఇక డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ చూసిన అభిమానులు.. ఆరేళ్లుగా మేం ఎదురు చూస్తుంది.. ఇలాంటి సినిమా కోసమే కదా అంటున్నారు.

సలార్ విడుదలకు ఒక్క రోజు ముందు షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా విడుదల అయ్యింది. కానీ యావరేజ్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ రేసులో వెనకపడింది. రిజల్ట్ ఎలా ఉన్నా.. డంకీ అనే పదం కొత్తగా ఉంది. ఇంతకు దీని మీనింగ్ ఏంటి అంటే.. విదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని డంకీ అని పిలుస్తారు. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు గతంలో షారుక్ తెలిపారు. అక్రమంగా ప్రవేశించే మార్గాన్ని డంకీ రూట్​ అనే పేరు వాడుకలోకి వచ్చిందని వివరించారు.

ఇక సలార్ మూవీ 500 కోట్ల మార్క్ క్రాస్ చేసి సాలిడ్ సక్సెస్ వైపు దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ మూవీ చాలా ఏరియాల్లో లాభాల పట్టడం విశేషం. అయితే.. సలార్ పార్ట్-1 లో ఇచ్చిన ట్విస్ట్ తో ఇప్పుడు పార్ట్-2 పై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు పార్ట్-1 లో సమాధానం లేకుండా మిగిలిపోయిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ కారణంగానే నీల్ తారక్ మూవీని కాస్త హోల్డ్ లో పెట్టేసి.. మళ్ళీ సలార్ సీక్వెల్ పైనే కూర్చోవాలన్న డిమాండ్ నెటిజన్స్ నుండి గట్టిగా వినిపిస్తోంది. అయితే.. మేకర్స్ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఏదేమైనా.. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో కటౌట్ కి తగ్గ బొమ్మ పడింది అని తెగ ఖుషీ అయిపోతున్నారు. మరి.. సలార్ అనే పవర్ ఫుల్ టైటిల్ సరైనోడికే పడింది కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి