iDreamPost

హనుమాన్ క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ లో ఇదే బెస్ట్.. 92 ఏళ్ళ తరువాత!

Hanuman Creates History: ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి వచ్చిన హనుమాన్ చిత్రం చరిత్ర తిరగరాస్తోంది. టాలీవుడ్ లో ఉన్న రికార్డులను బద్దలు కొడుతోంది. ఇది మాత్రం చాలా స్పెషల్.

Hanuman Creates History: ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి వచ్చిన హనుమాన్ చిత్రం చరిత్ర తిరగరాస్తోంది. టాలీవుడ్ లో ఉన్న రికార్డులను బద్దలు కొడుతోంది. ఇది మాత్రం చాలా స్పెషల్.

హనుమాన్ క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ లో ఇదే బెస్ట్..  92 ఏళ్ళ తరువాత!

హనుమాన్ సినిమా.. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. చిన్న సినిమా చిన్న సినిమా అంటూ చాలామందే కామెంట్స్ చేశారు. కానీ, ఆ చిన్న సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూసి పెద్ద పెద్ద సినిమాలు కూడా వణికిపోతున్నాయి. రిలీజైన 19 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. విదేశాల్లో అయితే బడా బడా హీరోల రికార్డులను కూడా బద్దలు కొడుతోంది. యూకేలో బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా 92 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవ్వరూ క్రియేట్ చేయని రికార్డును క్రియేట్ చేసింది. ఇది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.

హనుమాన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. హనుమాన్ సినిమా వాయిదా వేసుకోవాలి అంటూ చాలామందే చెప్పారు. కానీ, ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగానే జనవరి 12న రిలీజ్ చేశారు. స్టార్టింగ్ లో థియేటర్లు తక్కువ సంఖ్యలో దక్కినా కూడా.. మౌత్ టాక్ వల్ల క్రమంగా థియేటర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమానే కనిపిస్తోంది. ఓవర్సీస్ లో ఈ మూవీ రికార్డుల ఊచకోత కొనసాగుతూనే ఉంది. యూకేలో ఏకంగా బాహుబలి రికార్డును బద్దలు కెట్టింది. 3,12,000 పౌండ్ల కలెక్షన్స్ రాబట్టి బాహుబలి సినిమా కలెక్షన్స్ దాటేసింది. అలాగే స్టార్ హీరోల 5 చిత్రాలను వెనక్కి నెట్టి హనుమాన్ చిత్రం ఈ ప్లేస్ కి చేరుకుంది.

who rewrote Tollywood history

ఇంక ఇండియాలో కూడా హనుమాన్ కలెక్షన్స్ సునామీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రూ.275 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ ఫీట్ సాధించడానికి హనుమాన్ కు కేవలం 19 రోజులే పట్టడంపై చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి చిన్న సినిమా ట్యాగ్ తో వచ్చిన హనుమాన్ ఇప్పుడు రూ.300 కోట్ల కలెక్షన్స్ మీద గురిపెట్టడం చూస్తుంటే ఇది ప్రశాంత్ వర్మ మ్యాజిక్ అనే చెప్పాలి. కథలో విషయం ఉంటే.. కంటెంట్ మీద పట్టు ఉంటే.. విజువల్స్ తో వండర్స్ క్రియేట్ చేయగలిగితే అభిమానులు నీరాజనాలు పడతారని ప్రశాంత్ వర్మ చేసి చూపించాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో క్రియేట్ చేసిన రికార్డు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ 92 ఏళ్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ క్రియేట్ చేయని రికార్డును హనుమాన్ క్రియేట్ చేసింది. అదేంటంటే.. సంక్రాంతికి బరిలో దిగి రూ.275 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు టాలీవుడ్ లో సంక్రాంతి స్పెషళ్ గా వచ్చిన ఏ సినిమా కూడా ఇన్ని కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఆ ఫీట్ ని హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సాధించాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ నుంచి రాబోతున్న జైహనుమాన్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. పార్ట్.. హనుమాన్ కి మించి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హనుమంతుడిగా, రాముడిగా స్టార్ హీరోలు కనిపిస్తారని చెప్పారు. రాముడిగా మహేశ్ బాబుని చూపించాలని తనకి ఉందని ప్రశాంత్ వర్మ చెప్పాడు. హనుమంతుడిగా చిరంజీవి చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ హింట్ ఇచ్చారు. ఇంక అధీర వంటి సూపర్ హీరోల చిత్రాలతో కూడా ప్రశాంత్ వర్మ అలరించనున్నాడు. ఇదే క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ ఉంటే ప్రశాంత్ వర్మ ఏదో ఒకరోజు హాలీవుడ్ కి కూడా పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హనుమాన్ చిత్రం సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి