iDreamPost

Raja Deluxe : ప్రభాస్ ఒప్పుకుంది రిస్కీ కాంబినేషనా

Raja Deluxe : ప్రభాస్ ఒప్పుకుంది రిస్కీ కాంబినేషనా

ఊహించని విధంగా ప్రభాస్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతుండటం, దానికి రాజా డీలక్స్ అనే పేరు ప్రచారంలోకి రావడం అభిమానులను నిజంగానే షాక్ కు గురి చేసింది. అసలు ఏ మాత్రం కలలో కూడా అనుకోని కలయిక ఇది. ఒకపక్క పాన్ ఇండియా దర్శకులు క్యూ కట్టిన తరుణంలో తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటా అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగింది. అలా అని మారుతీని తక్కువ అంచనా వేయడం అని కాదు. తను సమర్థుడే. కాకపోతే ప్రభాస్ అంతటి స్టేచర్ ఉన్న స్టార్ ని డీల్ చేయగలడా లేదా అనేదే వాళ్ళ సందేహం. ఎంత దానయ్య నిర్మాతైనా ఇది ఆలోచించాల్సిన విషయమేగా.

ఈ డిస్కషన్ కు కారణం లేకపోలేదు. మారుతీ ఇమేజ్ ఉన్న హీరోలను సరిగా హ్యాండిల్ చేయలేడనేందుకు ఆధారాలు ఉన్నాయి. వెంకటేష్ పిలిచి మరీ బాబు బంగారం ఆఫర్ ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. నయనతార లాంటి హీరోయిన్, మంచి బడ్జెట్ ఇవన్నీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నెక్స్ట్ నాగ చైతన్యతో చేసిన శైలజా రెడ్డి గారి అల్లుడు కూడా సోసోగానే వెళ్ళింది. అత్తగా రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్ర, అను ఇమ్మానియేల్ గ్లామర్ పని చేయలేదు. సాయి తేజ్ తో చేసిన ప్రతి రోజు పండగే బాగా ఆడింది కానీ అది కూడా ఎవర్ గ్రీన్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా చెప్పుకోలేం. కామెడీతో గట్టెక్కింది.

ఇవన్నీ చూసుకుంటే ప్రభాస్ ఇప్పుడున్న ఇమేజ్ కి మారుతీ ఎంత ప్రెజర్ ని మేనేజ్ చేయగలడా అని. అయితే ఇది ఇప్పటికిప్పుడు మొదలయ్యే సూచనలు తక్కువ. రాధే శ్యామ్, ఆది పురుష్ అయిపోయాయి. సలార్ చివరి దశలో ఉంది. ప్రాజెక్ట్ కె షూటింగ్ జరుగుతోంది. సిద్దార్థ్ ఆనంద్ తో కమిట్ అయిన సినిమా ఇంకా అనౌన్స్ చేయాలి. మైత్రి బ్యానర్ కొకటి పెండింగ్ ఉంది. ఇవన్నీ అయ్యాకే రాజా డీలక్స్ ఉండొచ్చు. లేదా మధ్యలో రావొచ్చు. కేవలం యాభై రోజుల కాల్ షీట్స్ తో చాల వేగంగా ఇది పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకముందే రాజా డీలక్స్ చాలా పెద్ద టాపిక్ అయిపోయింది

Also Read : Akkineni Nageswara Rao : చెరిగిపోని నట సంతకం ANR

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి