iDreamPost

సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్? నెట్టింట చర్చకు కారణం అదే!

Is Prabhas Playing Dual Role In Salaar: సలార్ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

Is Prabhas Playing Dual Role In Salaar: సలార్ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్? నెట్టింట చర్చకు కారణం అదే!

సలార్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిలీజైన నాలుగురోజుల్లో దాదాపు రూ.470 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత డార్లింగ్ ప్రభాస్ తన సినిమాతో బాలీవుడ్ ని భయపెట్టాడు. బాలీవుడ్ బాద్షా కూడా బాక్సీఫీస్ వద్ద సైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్క ఇండియాలోనే కాకుండా యూఎస్ఏ, ఆస్ట్రేలియాలో కూడా సలార్ క్రేజ్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు చాలానే చర్చలు జరుగుతున్నాయి. అందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడా? అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులు సలార్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఖాన్సార్ గురించి, అందులో ఉండే తెగల గురించి అద్భుతమైన వీడియోలు తీసి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల్లో ఒక ప్రశ్న తలెత్తుతోంది. శౌర్యాంగ తెగకు చెందిన ధారాని హత్యచేసి రాజమన్నార్ ఖాన్సార్ కర్తగా మారాడు. అయితే అసలు దయా తండ్రి పాత్ర చేసింది ఎవరు? శౌర్యాంగ తెగ నాయకుడైన ధారా పాత్రలో నటించింది ఎవరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇదే ప్రశ్నను సలార్ అధికారిక ఎక్స్.కామ్ లో లేవనెత్తారు. దాంతో నెట్టింట ఇప్పుడు ఈ చర్చకు మరింత ఊపిచ్చినట్లు అయ్యింది.

అందరూ ధారా పాత్రను పోషించింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కోసం తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అభిప్రాయాలు, కొన్ని లాజిక్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. చాలా మంది ప్రభాస్ పాత్రకు తండ్రిగా ప్రభాసే నటించి ఉంటాడని చెబుతున్నారు. ఎందుకంటే ఆ కౌటౌట్ ని మ్యాచ్ చేయాలి అంటే అవతల కూడా అదే కటౌట్ ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం బాహుబలి థియరీని చెబుతున్నారు. ఎలా అయితే బాహుబలి సినిమాలో తండ్రి, కుమారుడు పాత్రలు ప్రభాస్ చేశాడో.. అలాగే ఈ సలార్ సినిమాలో కూడా రెండు పాత్రలను ప్రభాస్ చేశాడు ఉంటూ బలంగా చెబుతున్నారు. కేజీఎఫ్ పార్ట్ 2లో ఎలాగైతే సంజయ్ దత్తు పాత్రను చనిపోయినట్లు చూపించి తర్వాత తెరమీదకు తీసుకొచ్చారో.. అలాగే ధారా పాత్రను కూడా తిరిగి కథలోకి తీసుకొస్తారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా స్టార్టింగ్ లో గన్ మీద చేయి పెట్టి కూర్చున్న ప్రభాస్ మాస్ లుక్ ధారా పాత్రదే అంటూ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇంకొంతమందైతే తండ్రీ, కొడుకులు కలిసి చేసే పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయంటూ ఊహాగానాలు మొదలెట్టేశారు. మొత్తానికి అసలు ధారా పాత్ర చేసింది ఎవరు? నిజంగానే ధారా చనిపోయాడా? తండ్రీ కొడుకులు కలిసి నటించే సీన్స్ ని చూడబోతున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కచ్చితంగా ఇంకో రెండు, మూడేళ్లు ఆగాల్సిందే. సలార్ పార్ట్ 2.. శౌర్యాంగ పర్వం సినిమాలో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి. మరి.. సలార్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా? మీకేమనిపిస్తోంది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి