iDreamPost

Radhe Shyam : ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశారు – నెక్స్ట్ ఏంటి

Radhe Shyam : ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశారు – నెక్స్ట్ ఏంటి

నిన్న సాయంత్రం ప్రకటించినట్టు కాకుండా రాధే శ్యామ్ మొదటి లిరికల్ వీడియోని 5 కు బదులు మూడు గంటలు ఆలస్యంగా 9కు విడుదల చేయడం అభిమానుల్లో తీవ్ర అసహనాన్ని కలిగించింది. మూడు వందల కోట్ల బడ్జెట్ తో తీశామని చెప్పుకోవడం కాదు ఓ చిన్న వీడియోని రిలీజ్ చేయడానికి ఇంత ఆలస్యం చేయడం ముమ్మాటికీ ప్లానింగ్ లోపమే. సినిమాలు వాయిదా పడటం సహజం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సెన్సార్ ఇబ్బందులు, క్యూబ్ సమస్యలు, డిస్ట్రిబ్యూటర్లతో లావాదేవీలు ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ యుట్యూబ్ కు అలాంటి సమస్యలేవీ ఉండవుగా. మరి అలాంటప్పుడు ఒకరోజు ముందే సిద్ధం చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్ ఏంటి.

అందుకే యువి సంస్థని ఫ్యాన్స్ సైతం ట్రోలింగ్ చేయకుండా వదల్లేదు. ఓ ఫ్యాన్ ఏకంగా హైదరాబాద్ పోలీస్ ని ట్యాగ్ చేస్తూ ఆ నిర్మాతల జాడ కనిపెట్టండని ట్వీట్ కూడా చేశారు. ఇది సరదాగా చేశారనుకున్నా అభిమానుల ఎమోషన్లతో ఈ స్థాయిలో ఆడుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అసలే ఆర్ఆర్ఆర్ ఒకపక్క ప్రమోషన్లతో హోరెత్తిస్తోంది. దానికి పోటీగా వస్తున్న రాధే శ్యామ్ ఇలాంటి నిర్లిప్తతతో ఉంటే నెగ్గుకురావడం సులభం కాదు. సాహో టైంలోనూ ఇలాంటి పొరపాట్లు జరిగాయి. అయినా కూడా మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. అసలు టెక్నికల్ గా అన్నీ చెక్ చేసుకున్నాకే ప్రకటిస్తే పోయేది కదా. ఇలా అనిపించుకునే బాధ తప్పేది.

ఇంతా చేసి వచ్చిన వీడియోలో ప్రభాస్ పూజ హెగ్డేలు ఉన్నారా అంటే అదీ లేదు. యానిమేషన్ తో పని కానిచ్చేశారు. ఈ మాత్రం బొమ్మలు చూసేందుకా మేమింత ఎగ్జైట్ అయ్యామని అడుగుతున్న వాళ్ళు లేకపోలేదు. జస్టిన్ ప్రభాకరన్ ట్యూన్ మంచి మెలోడీతో ఆకట్టుకునేలా సాగింది. అందులో సందేహం లేదు. కృష్ణ కాంత్ సాహిత్యంలో తేలిక పదాలు బాగా కుదిరాయి. కానీ రావాల్సిన కిక్ రాలేదనదేది మూవీ లవర్స్ అభిప్రాయం. ఏది ఎలా ఉన్న రాబోయే పాటలకు, టీజర్ ట్రైలర్లకు మాత్రం ఈ ధోరణి మార్చుకోవాల్సిందే. లేదంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు ఆకాశమంత ఎత్తున హైప్ ని చేతులారా కిందికి దించినట్టు అవుతుంది

Also Read : Sankranthi Releases : రిలీజులు హీరోలవి గొడవలు అభిమానులవి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి