iDreamPost

ఆలస్యానికి కారణం అదే! ప్రశాంత్ నీల్ ఈ తప్పు ఎలా చేశాడు?

ఆలస్యానికి కారణం అదే! ప్రశాంత్ నీల్ ఈ తప్పు ఎలా చేశాడు?

వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం సలార్ టీమ్ పై గుర్రుగా ఉన్నారు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అని ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకటి రెండ్రోజుల్లో సలార్ టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అంటూ సంబరాలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులకు షాకిస్తూ సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.

సలార్ సినిమా వాయిదా వేస్తున్నట్లు సినిమా టీమ్ ప్రకటించింది. ఈ సినిమాని సెప్టెంబర్ లో కాకుండా నవంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో కూడా నవంబర్ రిలీజ్ అని అప్ డేట్ చేశారు. ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆలస్యానికి కారణం ఇదే అంటూ సీజీ వర్క్స్ గురించి చెబుతున్నారు. సలార్ సీజీ వర్క్స్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తి చెందలేదని.. అందుకే సినిమాని నవంబర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రశాంత్ నీల్- సినిమా టీమ్ వాళ్లదే అసలు తప్పు అంటున్నారు.

విషయం ఏంటంటే.. సలార్ సినిమా సీజీ వర్క్స్ కోసం ఎంచుకున్న సంస్థ విషయంలో తప్పు చేశారని చెబుతున్నారు. రోబో 2 సినిమా గ్రాఫిక్స్ కాంట్రాక్ట్ తీసుకుని సరిగ్గా పని పూర్తి చేయని సంస్థకు సలార్ సీజీ వర్క్స్ అప్పజెప్పారని చెబుతున్నారు. ఒక సినిమా అవుట్ పుట్ చూసి కూడా వారికి ఎలా సీజీ వర్క్ అప్పజెప్పారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్- ప్రశాంత్ నీల్ ముందుగానే సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అయ్యేది కాదు కదా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ పై ఈ సినిమాతో ప్రభాస్ దండయాత్ర మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల ఫలితాలతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రశాంత్ నీల్ రూపంలో వారికి ఒక మంచి హోప్ దొరికింది అంటూ చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ కావడంతో మరోసారి ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఫ్యాన్స్ కూడా మూవీ టీమ్ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. కంగారు కంగారు సినిమా రిలీజ్ చేసిన తర్వాత పేలవమైన సీజీ వర్క్ చూసి ఫ్యాన్స్ నిరాశ చెందాల్సి ఉంటుంది. అదే కాస్త సమయం తీసుకుని బెస్ట్ అవుట్ పుట్ తో వస్తే సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రశాంత్ నీల్ కూడా అదే చేస్తున్నాడు. అందుకే ఇంకో రెండు నెలలు ప్రభాస్ ఫ్యాన్స్ ఓపికతో ఉంటే ప్రశాంత్ నీల్- ప్రభాస్ నుంచి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ ని ఎక్స్ పెక్ట్ చేయచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి