iDreamPost

కేన్స్ చిత్రోత్సవంలో.. పూజా హెగ్డే డ్రెస్సు.. దీపికా నెక్లెస్‌.. ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే..

కేన్స్ చిత్రోత్సవంలో.. పూజా హెగ్డే డ్రెస్సు.. దీపికా నెక్లెస్‌.. ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే..

ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వచ్చిన తారలంతా తామే ప్రత్యేకంగా కనపడాలి అనుకుంటారు. ఇందుకోసం భారీగానే ఖర్చుపెడతారు సెలబ్రిటీలు. ఇక వారు వేసిన భారీ డ్రెస్సులతో, ఆభరణాలతో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై తమ అందాలని పరుస్తారు. ఈ సారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత తారలు చాలా మంది పాల్గొన్నారు. ఇక హీరోయిన్స్ అయితే రకరకాల డ్రెస్ లతో కనువిందు చేశారు.

మన దగ్గర వరుస సినిమాలతో మెప్పిస్తున్న పూజాహెగ్డే ఈ సారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక దీపికా పదుకొనె అవార్డుల ఎంపికలో జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించడం విశేషం. వీరిద్దరూ రెడ్ కార్పెట్ పై అత్యంత ఖరీదైన డ్రెస్సులతో అలరించారు. తాజాగా పూజా హెగ్డే రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్ లో హొయలొలికించింది. ఈ వైట్ డ్రెస్ ఖరీదు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. థైస్ కనిపించేలా ఒంటికి అతుక్కుపోయేలా పూజా హెగ్డే వేసుకున్న ఈ వైట్ డ్రెస్ ఖరీదు అక్షరాలా లక్షా 15వేల రూపాయలు. ఈ డ్రెస్ ని ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్ టోనీ మేటిసెవ్ స్కీ తయారు చేసినట్టు సమాచారం.

ఇక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ మెంబర్‌గా పాల్గొన్న దీపికా పదుకొనె కూడా రకరకాల డ్రెస్సులతో మెరిపించింది. ఈ డ్రెస్సులు మీద ఖరీదైన ఆభరణాలు కూడా వేసింది. దీపికా బ్లాక్ డ్రెస్ మీద వేసిన ఓ జ్యువెల్లరీ ధర వింటే వామ్మో అనాలసిందే. నలుపు రంగు సూట్‌ మీద దీపికా ధరించిన ఓ వజ్రాల నెక్లెస్‌ ని ధరించింది. పూర్వ కాలం నాటి కడెం రూపంలో ఈ నెక్లెస్‌ ఉంది. ఈ నగకు ముందు భాగంలో పులి ముఖాలు వచ్చేలా దీనిని డిజైన్‌ చేశారు. ఈ నెక్లెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ అయిన కార్టియర్‌ తయారు చేసినట్టు సమాచారం. దీని ధర అక్షరాలా 3 కోట్ల 80లక్షల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. ఈ నెక్లెస్‌ కి బంగారం, వజ్రాలు, పచ్చలు వాడారు.

ఇలా సెలబ్రిటీలు లక్షల్లో, కోట్లలో వేసే డ్రెస్ లు ఆభరణాలు చూస్తూ అవాక్కవుతున్నారు నెటిజన్లు. ఎంతైనా స్టార్ సెలబ్రిటీలు కదా ఆ మాత్రం ఖర్చుపెట్టకపోతే ఎలా అని అంటున్నారు.