iDreamPost

మూడు భాషల్లో మహా బిజీ

మూడు భాషల్లో మహా బిజీ

గత రెండు మూడు రోజులుగా భారీ సినిమాల అప్ డేట్స్ తో టాలీవుడ్ మూవీ లవర్స్ ఆనందం మాములుగా లేదు. విడుదల తేదీలు, వాటికి సంబంధించిన పోస్టర్లు, వీడియోలతో ఒకటే హల్చల్ నడుస్తోంది. డిసెంబర్ లో వచ్చే పుష్పతో మొదలుపెట్టి జనవరిలో రాబోయే క్రేజీ చిత్రాల సంగతులతో సోషల్ మీడియాలో మంచి చర్చలు నడుస్తున్నాయి. దీనికి పూజా హెగ్డేకి కనెక్షన్ ఏంటనుకుంటున్నారా. రాధే శ్యామ్ లో తనే హీరోయినన్న సంగతి తెలిసిందే. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మీద పూజా హెగ్డేకు చాలా ఆశలున్నాయి. దీంతో పాటు ఇదే సీజన్ లో పూజా డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది.

విజయ్ హీరోగా తమిళంలో రూపొందుతున్న బీస్ట్ కూడా సంక్రాంతికి అరవ భాషలో చెప్పాలంటే పొంగల్ కు రెడీ అవుతోంది. దీని మీదున్న అంచనాల గురించి రాసుకుంటే ఒక పుస్తకమే అవుతుంది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. తెలుగులో ఎంత విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ విజయ్ మాత్రం ఖచ్చితంగా పండగకే తీసుకురావాలని చెప్పాడట. ఈ ఏడాది దీపావళికి ఛాన్స్ లేదు కాబట్టి తన రేంజ్ బిజినెస్ ని మ్యాచ్ అవ్వాలంటే జనవరి కంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి ఉండదు. సో ఈ బీస్ట్ కూడా రంగంలోకి దిగితే తెలుగు ప్రేక్షకులకు మొత్తం అయిదు ఆప్షన్లు అవుతాయి.

టాలీవుడ్ లోనే టాప్ డిమాండ్ ఉన్న పూజా హెగ్డేకు ఇలా ఒకే సీజన్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ కావడం అంటే స్పెషలేగా. అన్నట్టు అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం ఎదురు చూసేకొద్దీ ఆలస్యమవుతూనే ఉంది. అసలు ఎప్పుడు వస్తుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఫ్యాన్స్ మాత్రం పూజా గ్లామర్ తో దానికి చాలా ప్లస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. స్పెషల్ రోల్ చేసిన ఆచార్య కూడా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా హిందీలో సర్కస్, భాయ్ జాన్ లు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తానికి మూడు భాషల్లో ఇంత బిజీగా ఉన్నది పూజా హెగ్డేనే

Also Read : అల్లు అర్జున్ ముందే వస్తున్నాడా ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి