అల్లు అర్జున్ ముందే వస్తున్నాడా ?

By iDream Post Aug. 03, 2021, 01:06 pm IST
అల్లు అర్జున్ ముందే వస్తున్నాడా ?

ఇంకా సగం షూటింగ్ పైగానే బ్యాలన్స్ ఉన్న పెద్ద సినిమాలు ఒకపక్క రిలీజ్ డేట్లు ప్రకటిస్తుంటే చివరి దశలో ఉన్నవి మాత్రం ఇంకా అయోమయంలో కొనసాగడం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. అలాంటి ఇబ్బందేమీ లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ పండగ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన కూడా మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. ఎలాగూ ఈ నెల 13న ఫస్ట్ ఆడియో సింగల్ ని లాంచ్ చేయబోతున్నారు కనక ఆలోగానే అనౌన్స్ మెంట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంక్రాంతి రేస్ లో రావడం లేదనే క్లారిటీ మాత్రం పక్కాగా రాబోతోంది.

ఇదీ ఒకందుకు మంచిదే. కెజిఎఫ్ 2 కూడా విడుదల తేదీని ఫిక్స్ చేసే పనిలో ఉంది. ఒకవేళ అది కూడా క్రిస్మస్ అంటే క్లాష్ తప్పక పోవచ్చు. రెండు పాన్ ఇండియా సినిమాలే కనక థియేటర్ల విషయంలో గట్టి పోటీ నెలకొంటుంది. అందులోనూ అంచనాల విషయంలో ఎవరికి ఎవరు తీసిపోమనే రేంజ్ లో హైప్ తెచ్చుకున్నారు. అందుకే ముందే చెప్పేసుకుంటే సేఫ్ గా ఉండొచ్చు. కెజిఎఫ్ 2 నిర్మాతలు సైతం ఎప్పుడు ప్రకటించాలా అనే విషయంలో తర్జనభర్జనను పడుతున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది డిసెంబర్ లోనే. సో సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందనుకోవచ్చు. ఇంకా క్లారిటీ రావాలి.

ఇంకా పుష్ప షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఇటీవలే సుకుమార్ కు కొంత అనారోగ్యం ఏర్పడటంతో గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ కోలుకున్నారు కానీ ఆర్టిస్టుల కాంబినేషన్ డేట్ల సమస్య రావడంతో సెప్టెంబర్ నుంచి శరవేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నారట. రెండో భాగాన్ని కూడా వచ్చే ఏడాది ప్రారంభం నుంచే కంటిన్యూ చేస్తారా లేక బన్నీ వాస్ చెప్పినట్టు ఇంకో సినిమా చేసి అప్పుడు పుష్ప 2ని తీస్తారా అనేది తెలియాల్సి ఉంది. సుకుమార్ మాత్రం బాహుబలి తరహాలో రెండు భాగాలు ఏకబికిన తీయాలని అనుకుంటున్నట్టు సమాచారం. అది అల్లు అర్జున్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ఇందులో ఇతర తారాగణం

Also Read: అయోమయంలో బడా నిర్మాతలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp