iDreamPost

VIDEO: రాఖీ సెంట్ మెంట్ తో బాలిక ప్రాణాలు కాపాడిన పోలీస్! ఎలాగో మీరే చూడండి!

VIDEO: రాఖీ సెంట్ మెంట్ తో బాలిక ప్రాణాలు కాపాడిన పోలీస్! ఎలాగో మీరే చూడండి!

అది గురువారం, పైగా రాఖీ పండగ. అందరూ అమ్మాయిలు తమ అన్నదమ్ముళ్లకు రాఖీ కట్టే పనిలో నిమగ్నమయ్యారు. కానీ, ఓ బాలిక మాత్రం.. ఓ కారణంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఇక అనుకున్నట్లే వీరి ఇంటి సమీపంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లోని బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఆమె అపార్ట్ మెంట్ ఎక్కి దూకుతానంటూ ఏడుస్తూ చెప్పింది. వెంటనే ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎలాగైనా ఆ బాలిక ప్రాణాలు కాపాడాలని అనుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి వెళ్లిన ఏసీపీ రాఖీ సెంట్ మెంట్ తో ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడాడు. కూతురుని రక్షించడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ ఘజియబాద్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ బాలిక తన తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే గురువారం ఏదో విషయంపై తండ్రి ఆ బాలికపై ఆగ్రహంతో ఊగిపోయి తిట్టాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో కానీ.. ఆ క్షణం చనిపోవాలని డిసైడ్ అయింది. ఇక అనుకున్నట్లుగానే చనిపోవాలని అనుకుని వీరి ఇంటి సమీపంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ 4వ అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూకాలని అనుకుంది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక ప్రాణాలు కాపాడాలని విష్వ ప్రయత్నాలు చేశారు. కానీ, ఎంతకు ఆ బాలిక కిందకు దిగలేదు. ఇదే సమయంలో అక్కడి చేరుకున్న ఏసీపీ స్వతంత్ర సింగ్.. ఆ బాలికను రక్షించేందుకు రాఖీ సెంట్ మెంట్ ను వాడుకున్నాడు. అదేంటంటే? నాకు నీవు రాఖీ కట్టాలని, అలాగైతే నేను నీకే ఫుల్ సపోర్ట్ చేస్తానని నచ్చజెప్పాడు. ఏకంగా ఏసీపీ సెంట్ మెంట్ తో అలా కోరడంతో ఆ బాలిక మనసు మార్చుకుని సరేనంటూ కిందకు దిగింది. ఆ తర్వాత పోలీసులు ఆ బాలికకు కౌన్స్ లింగ్ ఇచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి