iDreamPost

విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ వచ్చి భారీగా రిలీజ్ అయింది. అయితే సినిమా పరంగా చూస్తే బాగానే ఉన్నా ఈ సినిమా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవలే సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయి వార్తల్లో నిలిచింది ఈ సినిమా.

తాజాగా విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ సినిమా నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. విశ్వ హిందూ పరిషత్‌ విద్యానగర్‌ జిల్లా కార్యదర్శి కె.అజయ్‌ రాజ్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు శనివారం సాయంత్రం ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు.

విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉంది. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో చాలావరకు అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నాయి కావున సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ప్రశ్నించి విరాటపర్వం సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్‌ బోర్డు అధికారి శిఫాలి కుమార్‌ పై కూడా ఫిర్యాదు చేశారు. సుల్తాన్‌బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి