iDreamPost

బడ్జెట్ లో మరో POCO 5జీ ఫోన్‌.. ఫీచర్లు చూస్తే అస్సలు వదిలిపెట్టరు

మీరు ఈ మద్య స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసం అద్భుతమైన ఫీచర్లతో కూడిన 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. పోకో నుంచి మరో కొత్త 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.

మీరు ఈ మద్య స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసం అద్భుతమైన ఫీచర్లతో కూడిన 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. పోకో నుంచి మరో కొత్త 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.

బడ్జెట్ లో మరో POCO 5జీ ఫోన్‌.. ఫీచర్లు చూస్తే అస్సలు వదిలిపెట్టరు

స్మార్ట్ ఫోన్ యూజర్లకు మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను పరిచయం చేస్తూనే ఉన్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులు సైతం మార్కెట్ లోకి లాంచ్ అయ్యే కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికోసం పోకో నుంచి మరో 5జీ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు. పోకో 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లకు ఫిదా కావాల్సిందే. ఈ ఫోన్ ధర కూడా బడ్జెట్ ధరలోనే ఉండనుంది.

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ పోకో ఎక్స్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. పోకో ఎక్స్6 నియో పేరిట 5జీ ఫోన్‌ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. పోకో ఎక్స్‌6 నియో 8జీబీ+128జీబీ, 12జీబీ+256 జీబీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్‌, బ్లూ, ఆరెంజ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ప్రారంభ ధర మాత్రం రూ. 14999 మాత్రమే ఉంది. కాగా 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,999 కాగా, 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. త్వరలోనే సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పోకో ఎక్స్‌ 6, పోకో ఎక్స్‌ 6 ప్రోను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

POCO X6 5G phone in budjet rate

ఫీచర్లు:

పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్‌ ఫీచర్ల విషయంలో స్మార్ట్ ఫోన్ ప్రియులను కట్టిపడేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 108 కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 120 రిఫ్రెష్‌ రేటు అమోలెడ్‌ డిస్‌ప్లేను అందించారు. 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్‌ను పొందుపర్చారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో పనిచేస్తుంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్, ఐఆర్‌ బ్లాస్టర్‌, ఐపీ 54 ప్రొటెక్షన్, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. 33వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి