iDreamPost

గుడ్ న్యూస్.. సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది! లాంచింగ్ ఆరోజేనే!

  • Published Apr 24, 2024 | 7:42 PMUpdated Apr 24, 2024 | 7:42 PM

ప్రస్తుతం కాలంలో మార్కెట్ లో ఎలక్ట్రికల్ స్కూటర్ల హవా నడుస్తున్న విషయం తెలసిందే. కాగా, ఇప్పటికే మార్కెట్ లో ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజాలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా సుజుకీ కూడా తన ప్రసిద్ధ ఉత్పత్తి అయిన యాక్సెస్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి, దాని వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం కాలంలో మార్కెట్ లో ఎలక్ట్రికల్ స్కూటర్ల హవా నడుస్తున్న విషయం తెలసిందే. కాగా, ఇప్పటికే మార్కెట్ లో ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజాలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా సుజుకీ కూడా తన ప్రసిద్ధ ఉత్పత్తి అయిన యాక్సెస్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి, దాని వివరాలను తెలుసుకుందాం.

  • Published Apr 24, 2024 | 7:42 PMUpdated Apr 24, 2024 | 7:42 PM
గుడ్ న్యూస్.. సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది!  లాంచింగ్ ఆరోజేనే!

ప్రస్తుతం కాలంలో మార్కెట్ లో ఎలక్ట్రికల్ స్కూటర్ల హవా నడుస్తోంది. ఇప్పటికే చాలామంది వాహనాదారులు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఇబ్బందులు పడలేక ఈ ఎలక్ట్రికల్ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు విపరీతమైన డిమాండ్ పేరిగిపోయింది. అలాగే వివిధ సంస్థలు కూడా తక్కువ ఖర్చుతో, ఆధునిక ఫీచర్స్ తో రకరకాల మోడల్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే వీటిలో టాప్ బ్రాండ్ల నుంచి చిన్న చిన్న స్టార్టప్ లు సైతం ఈవీల ఉత్పత్తికి సై అంటున్నాయి.అంతేకాకుండా.. ప్రస్తుతం ఉన్న ఆటో మొబైల్ దిగ్గజాలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నాయి.దీనిలో ఇప్పటికే హీరో కంపెనీ, హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకురాగా.. ఇప్పుడు వీటి స్థానంలో సుజుకీ కూడా తన ప్రసిద్ధ ఉత్పత్తి అయిన యాక్సెస్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశంలో అత్యంత విజయవంతమైన సుజుకీ యాక్సెస్.. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వేరియంట్లో  తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సుజూకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్లో అన్ని సక్రమంగా కుదరితే ఈ ఏడాదిలో లాంచ్ చేసేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. అయితే ఈ సుజకీ యాక్సెస్ సరికొత్త వెర్షన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందా.  జపనీస్ బ్రాండ్ కు చెందిన సుజుకి ఈ ఏడాది కొత్తగా ఎలక్ట్రిక్ స్యూటర్ ను ప్రారంభించాలని ప్రయాత్నలలో ఉంది. ఇప్పటికే దీనిని తయారు చేసినట్లు వివిధ సోర్సెస్ చెబుతున్నాయి.  అయితే  ఇది జపాన్ లోని ఇంజినీర్‌లతో కలిసి అభివృద్ధి చేసినట్లు తెలుస్తోది.  కాగా, ఈ కంపెనీ గత రెండు సంవత్సరాలుగా బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్‌ను పరీక్షిస్తున్నప్పటికీ, ఇది భారతదేశంలో మొదటిసారి తన ఉనికిని చాటుకునే గొప్ప యాక్సెస్ అని సంస్థ చెబుతుంది.

అయితే ఈ సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ ను  ఈవీని ఈ-యాక్సెస్ అని పిలిచే అవకాశం ఉంది. అలాగే దీనిలో ఇ-బర్గ్‌మ్యాన్‌లో పేరు పెట్టే కన్వెన్షన్ కూడా కనిపిస్తుంది. ఇక దీని డిజైన్ పరంగా.. సుజుకి ఈ-బర్గ్‌మ్యాన్‌తో అదే విధానాన్ని తీసుకుంటుంది. అయితే మొత్తంగా ఇందులో  స్టైలింగ్, బాడీ కాంపోనెంట్‌లు పెట్రోల్ ఇంజిన్ మోడల్‌ను పోలి ఉంటాయి. కనుక దీని వలన పర్యావరణ అనుకూల స్వభావాన్ని ప్రదర్శించడానికి ‘బ్లూ’ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది.

ఇక సుజుకీ  యాక్సెస్ ఎలక్ట్రికల్ వెర్షన్ ఫీచర్ల విషయానికొస్తే.. ప్రస్తుతం దీని మోటర్ కెపాసిటీ, బ్యాటరీ, రైడింగ్ రేంజ్‌ వంటి వివరాలు అనేవి కంపెనీ నుంచి ఇంక అందుబాటులో లేవు. అయితే ఇది 125సీసీ స్కూటర్ పనితీరును కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఫీచర్ల పరంగా ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ సుజుకీ స్కూటర్‌కు ఎక్కువ ఫ్యాన్సీ ఫీచర్లను అందించకపోవచ్చని చెబుతున్నారు. మరి, ఇప్పుడు మార్కెట్ లో సుజూకీ కూడా యాక్సెస్ ఎలక్ట్రికల్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి