iDreamPost

ఈ రెస్టారెంట్‌లో వంటలతో పాటు గోడను కూడా రుచిచూస్తారు!

  • Published Jul 13, 2023 | 2:10 PMUpdated Dec 14, 2023 | 6:33 PM

ఓ రెస్టారెంట్‌లో రుచికరమైన వంటకాలతో పాటు అంతకంటే రుచికరమైన గోడ ఉంది. రెస్టారెంట్‌కు వచ్చే వారు కడుపునిండా నచ్చింది తిని, వెళ్లే ముందు ఆ గోడను నాలుకతో రుచి చూసి వెళ్తారు. కావాలంటే ఒక ముద్ద తక్కువ తింటారేమో కానీ, ఆ గోడను రుచి చూడకుండా మాత్రం అడుగు బయటపెట్టారు.

రెస్టారెంట్‌ అంటే పసైంద వంటకాలు, వెరైటీ వెరైటీ డిష్‌లు దొరకాలి. అంతేకానీ రుచికరమైన గోడ ఉండటమేంటి? అదే ఇక్కడ స్పెషల్‌. ఓ రెస్టారెంట్‌లో రుచికరమైన వంటకాలతో పాటు అంతకంటే రుచికరమైన గోడ ఉంది. రెస్టారెంట్‌కు వచ్చే వారు కడుపునిండా నచ్చింది తిని, వెళ్లే ముందు ఆ గోడను నాలుకతో రుచి చూసి వెళ్తారు. కావాలంటే ఒక ముద్ద తక్కువ తింటారేమో కానీ, ఆ గోడను రుచి చూడకుండా మాత్రం అడుగు బయటపెట్టారు. ఆ గోడంటే అక్కడికి వచ్చే కస్టమర్లకు అంతిష్టం. ఇంతకీ ఆ గోడ స్పెషాలిటీ ఏంటి? ఆ రెస్టారెంట్‌ ఎక్కడుంది? ఎందుకు కస్టమర్లు ఆ గోడను నాలుకతో రుచిచూస్తారు? లాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాలోని అరిజోనా మిషన్‌ అనే ఓ విచిత్రమైన రెస్టారెంట్‌ ఉంది. ఈ రెస్టారెంట్‌లోనే రుచికరమైన గోడ ఉంది. ఈ రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు భోజనం చేసి.. వెళ్లేముందు గోడను నాలుకతో రుచి చూస్తారు. ఈ గోడను పింక్‌ హిమాలయన్‌ సాల్ట్‌తో తయారు చేశారు. గతంలో ఈ రెస్టారెంట్‌ హెడ్‌ చెఫ్‌ ఈ గోడను ఇక్కడ నిర్మించారు. ఆ పింక్‌ సాల్ట్‌ను రుచి చూడటం కోసమే రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు నాలుకతో గోడను నాకుతుంటారు.

అయితే.. వచ్చిన ప్రతివారు అలా నాకితే.. రోగాలు రావా? అని అనుమానం వస్తుంది కదా? అలా రోగాలు ఏం రావు. ఎందుకంటే ఈ పింక్‌ సాల్ట్‌లో బ్యాక్టీరియాను నశింపజేసే లక్షణం ఉంది. అందుకే ఎంతమంది నాకినా ఎవరికీ ఎలాంటి రోగాలు రావడంలేదు. పైగా ప్రతి రోజు ఆ గోడను రెస్టారెంట్‌లో పనిచేసే వారు శుభ్రంగా తుడుస్తుంటారు. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌, ఆ గోడ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయింది. ఈ రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి కంటే కూడా గోడను రుచి చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించి వస్తున్నారని, గోడ వల్ల గిరాకీ కూడా బాగా ఉందని రెస్టారెంట్‌ నిర్వహకులు అంటున్నారు. మరి ఈ రుచికరమైన గోడపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సగం కాలిన శవాన్ని తిన్న మందుబాబులు.. భయాందోళనలో ప్రజలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి