iDreamPost

హలో అంటూ ఒక్క ఫోన్ కాల్.. 30 లక్షలు పోగొట్టుకున్న PHD స్కాలర్ !

  • Published Mar 26, 2024 | 1:53 PMUpdated Mar 26, 2024 | 1:53 PM

ఇటీవలే దేశవ్యాప్తంగా పార్సెల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్ లకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ రకాలుగా బాధిత ప్రజలకు ఫోన్లు చేస్తూ వారి దగ్గర కోట్ల రూపాయలను కాజేస్తున్నారు. తాజాగా నగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక్క ఫోన్ కాల్ తో సైబర్ధితుడిని భయంద్రోళనకు గురి చేశారు.

ఇటీవలే దేశవ్యాప్తంగా పార్సెల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్ లకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ రకాలుగా బాధిత ప్రజలకు ఫోన్లు చేస్తూ వారి దగ్గర కోట్ల రూపాయలను కాజేస్తున్నారు. తాజాగా నగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక్క ఫోన్ కాల్ తో సైబర్ధితుడిని భయంద్రోళనకు గురి చేశారు.

  • Published Mar 26, 2024 | 1:53 PMUpdated Mar 26, 2024 | 1:53 PM
హలో అంటూ ఒక్క ఫోన్ కాల్.. 30 లక్షలు పోగొట్టుకున్న PHD స్కాలర్ !

ఇటీవలే దేశవ్యాప్తంగా పార్సెల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్ లకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ రకాలుగా బాధిత ప్రజలకు ఫోన్లు చేస్తూ వారి దగ్గర కోట్ల రూపాయలను కాజేస్తున్నారు. ఇప్పటికే వీటి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తం చేస్తున్నా.. సైబర్ కేటుగాళ్లు మాత్రం రోజుకో కొత్త తరహా నేరాలతో విజృంభిస్తున్నారు. ఇక వీరి వలలో చిక్కుకున్న ప్రజలు లేనిపోని అపోహలను నమ్మి లక్షల కొలది నగదును పొగొట్టుకుంటున్నారు.తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ బాధితుడు కూడా ఈ సైబర్ నేరస్తుల వలలో చిక్కుకున్నాడు. ఇక ఆ బాధితుడిని పార్సెల్స్ పేరుతో ఫోన్ చేసి చివరికి ఊహించని షాక్ ఇచ్చి భయంద్రోళనకు గురి చేశారు.ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్య సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇష్టానుసారంగా ఫోన్ నెంబర్లు సేకరించి కొత్త కొత్త స్కామ్‌ల పేరుతో బాధితులను బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థి ఖాతా నుంచి 30 లక్షల రూపాయలను కాజేశారు. అసలేం జరిగిందంటే..హైదరాబాద్‌కు చెందిన ఐఐటి పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థికి ఒక అగంతకుడు నుంచి కాల్ వచ్చింది. ఈ క్రమంలోనే.. అవతల వ్యక్తి తాను కొరియర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నామని ఆ విద్యార్థికి తెలిపారు. అయితే ఆ పార్సిల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని ఆ విద్యార్థికి నమ్మబలికారు. కానీ, ఆ విద్యార్థి ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలుపాలని కొరియర్ వారిని ఎదురు ప్రశ్న వేశాడు. దీంతో ఆ సైబర్ నేరగాళ్లు అనుమానాస్పదంగా ఉన్న పార్సెల్‌లో డ్రగ్స్ తో పాటు ఒక పాస్‌పోర్ట్ కూడా ఉన్నట్లు బాధితుడిని నమ్మించారు. అలాగే తనతో పాటు తన కుటుంబీకుల మొబైల్స్ లాప్టాప్‌లను.. టెర్రరిస్ట్ గ్రూపులు హ్యాక్ చేశారని నమ్మించారు.

Hacker

ఈ క్రమంలోనే కొరియర్ సంస్థ నిర్వాహకులు వెంటనే ముంబై పోలీసులకు కాల్ కలుపుతున్నట్లు నమ్మించారు. అయితే వెంటనే లైన్‌లోకి వచ్చిన మరో సైబర్ నేరగాడు బాధితుడిని మరింత బెదిరించే ప్రయత్నం చేశాడు. కాగా, బాధితుని బ్యాంక్ అకౌంట్‌కు టెర్రరిస్టులతో లింక్ ఉన్నట్లు నమ్మించారు. అందుకే తన మీద కేసు నమోదు చేస్తున్నామంటూ ఒక నకిలీ ఎఫ్ఐఆర్‌ను సైతం తయారు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించారు. అయితే ఇదంతా నిజమేమో అని నమ్మిన బాధితుడు సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా రూ. 30 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాకి బదిలీ చేశాడు. ఇక ఈ ఉదాంతంపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ తాను ఎలాంటి కొరియర్ పెట్టలేదని అయినా సరే పలు విధాలుగా తనను నమ్మించే ప్రయత్నం చేశారని, తీవ్ర ఒత్తిడికి గురైన తాను రూ. 30 లక్షల రూపాయలు చెల్లించానని సైబర్ క్రైమ్ పోలీసులను తెలిపాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వారి ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి నగదు బదిలీ కాకుండా.. సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సైబర్ క్రైమ్ కు గురవుతున్న బాధితులు 24 గంటల్లోపు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే బాధితులకు ఖాతా నుంచి నేరగాళ్ల అకౌంట్లోకి నగదు జమ కాకుండా ఫ్రీజ్ చేయగలుగుతామని పోలీసులు తెలుపుతున్నారు. మరి, పార్సెల్స్ పేరుతో సైబర్ క్రైమ్ కి పాల్పడి లక్షలు కొల్లగొట్టిన ఈ ఘటన పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి