iDreamPost

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరిట మెసాలు! 400 మందిపైనే మోసం చేశాడు!

  • Published Mar 18, 2024 | 4:14 PMUpdated Mar 18, 2024 | 4:21 PM

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ .. ఎంతో మంది నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ .. ఎంతో మంది నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 18, 2024 | 4:14 PMUpdated Mar 18, 2024 | 4:21 PM
Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరిట మెసాలు! 400 మందిపైనే మోసం చేశాడు!

ఈ మధ్య కాలంలో అమాయకులను మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఉద్యోగం చూపిస్తామనే పేరుతో ఎంతో మంది నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో.. ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగులు ఈ వలలో చిక్కుకుపోతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో బ్యాక్ డోర్ ద్వారా జాబ్స్ ఇప్పిస్తామని నిరుద్యోగులను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హై టెక్ మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడు ఓ వ్యక్తి. సుమారు 400 మంది ఈ వ్యక్తి చేతిలో మోసపోయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం.. బండ్లవంక ప్రాంతానికి చెందిన రెడ్డి సూర్యప్రసాద్‌ అలియాస్‌ భరత్‌ అనే వ్యక్తి హైదరాబాద్, బెంగళూరుల్లో నివసిస్తూ ఉంటాడు. కాగా, ఈ వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొంతమంది నిరుద్యోగులను టార్గెట్ చేశాడు. అసలే బయట సాఫ్ట్ వేర్ రంగంలో హెవీ కాంపిటీషన్ ఉండడంతో.. కొంతమంది యువత అతని మాటలు నమ్మి.. అతనికి వారి వారి రెస్యూమ్స్ పంపించాడు. ఆ తర్వాత వారితో .. ముందుగా డిపాజిట్ రూపంలో కొంత అమౌంట్ చెల్లిస్తే.. నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు శాలరీ వచ్చే ఉద్యోగాలను ఇప్పిస్తాను అంటూ.. నమ్మించాడు. ఈ క్రమంలో ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డబ్బును తీసుకున్నాడు. అలా రెండు నెలల పాటు తన బినామీ కంపెనీ నుంచి వారికీ జీతాలిచ్చి .. ఆ తర్వాత బోర్డు తిప్పేశాడు.

దీనితో అనుమానం కలిగిన భాదితులు పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు పీలేరు పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. పోలీసుల విచారణ ప్రకారం గుంటూరు, ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లోని 400 మందికిపైగా నిరుద్యోగులు.. ఇతని మాయమాటలు నమ్మి మోసపోయారని గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన పలువురు నిరుద్యోగులు కూడా ఇతని వలలో చిక్కుకున్నట్లు సమాచారం. ఏదేమైనా సమాజంలో ఇటువంటి మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులు ఎలాగైనా ఉద్యోగం సాదించాలి అనే తపనతో.. ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. కాబట్టి ఇకనైనా నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండడం మంచిదని పోలీసులు హెచ్చరించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి