iDreamPost

బ్రేకింగ్: తెలంగాణ సీఎస్ పేరుతో ఫేక్ కాల్స్..కేసు నమోదు!

CS Shanti Kumari Issue: ఈ మద్య టెక్నాలజీ పేరుతో ఎన్నో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఐఏఎస్, ఐపీఎస్ ఇతర హై క్యాడర్ లో ఉన్న ఉద్యోగుల ఫోటోలు, పేర్లతో ఫేక్ కాల్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు.

CS Shanti Kumari Issue: ఈ మద్య టెక్నాలజీ పేరుతో ఎన్నో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఐఏఎస్, ఐపీఎస్ ఇతర హై క్యాడర్ లో ఉన్న ఉద్యోగుల ఫోటోలు, పేర్లతో ఫేక్ కాల్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు.

బ్రేకింగ్: తెలంగాణ సీఎస్ పేరుతో ఫేక్ కాల్స్..కేసు నమోదు!

ఇటీవల తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను సంచలనాలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్నో రకాల స్టార్ మార్కెట్ ల పేరిట పెట్టుబడులు పెట్టాంటూ జనాలకు ఆశ చూపించి టోకరా వేస్తున్నారు. మరికొంతమంది మీకు ప్రైజ్ మనీ వచ్చింది.. డిటేల్స్ ఇవ్వాలని చెబుతూ నిలువునా దోచేస్తున్నారు. ఆల్ లైన్ వ్యవస్థను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు తమ ఇష్టానుసారంగా ఉన్నచోట ఉంటూనే దోపిడికి తెగబడుతున్నారు.ప్రముఖుల పేర్లు చెబుతూ ఫేక్ కాల్స్ చేస్తూ డబ్బులు దోచేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎస్ శాంతకుమారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి ఎన్నో రకాల దోపడీలకు పాల్పపడుతున్నారు. ఘరానా మోసగాళ్ళు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ అమాయకులను నిలువునా దోచేస్తున్నారు. ఈ ఇబ్బందులు సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులకు కూడా తప్పడం లేదు. గతంలో కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ల ఫోటోలు,పేరు వాడుకొని కొంతమంది బెదిరించి డబ్బు దోచుకున్న ఘటనలు జరిగాయి. తాజాగా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ సీఎస్ శాంతికుమారికి వచ్చింది.

తెలంగాణ సీఎస్ శాంతికుమార్ తన పేరు, ఫోటోను ఉపయోగించి కొంతమంది మోసగాళ్లు పలువురుకి ఫేక్ కాల్స్ చేస్తున్నారని.. ఐఏఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. +977-984-4013103 ఫోన్ నెంబర్ తో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కొందరికి కాల్స్ చేస్తున్నారని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరీ (టీఎస్‌సీఎస్‌బి) కి ఫిర్యాదు చేశార. తన పేరుతో ఫేక్ కాల్స్ చేస్తున్నవారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సీఎస్ శాంతికుమారి కోరారు. కేసు నమోదు చేసుకున్న టీఎస్‌సీఎస్‌బి ఫేక్ కాల్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి