iDreamPost

TDP మా అమ్మని దూషించింది అన్నాడు. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు..!

TDP మా అమ్మని దూషించింది అన్నాడు. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలుకి వెళ్లిన తర్వాత ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. అయితే ఇంతటి సంక్షోభంలో టీడీపీకి నేనున్నా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అన్నారు. అయితే పవన్ కల్యాణ్ తీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్.. టీడీపీపై, లోకేశ్ పై చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2019 ఎన్నికల సందర్భంలో పవన్ కల్యాణ్.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంలో లోకేశ్ పై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. “మీకు అండగా ఉండి.. ఉభయగోదావరి జిల్లాల నుంచి అధిక సీట్లు ఇస్తే.. మీరు నా తల్లిని దూషించారు. టీడీపీని, లోకేశ్ ను క్షమించే ప్రస్తకేలేదు” అంటూ ఆవేశంగా ప్రసంగించారు. అలానే లోకేష్ కూడా ఒకానొక సందర్భంలో కేంద్రానికి పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తో వీరి తీరు మారిపోయింది.

దత్తపుత్రుడని పిలిచిన నోటితోనే పవన్ కల్యాణ్ ను.. అన్న అని నారా లోకేశ్ సంబోధించాడు. అలానే పవన్ కల్యాణ్ కూడా తన తల్లిని దూషించిన పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ సైతం పొత్తును జీర్ణించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. అసలు పవన్ కల్యాణ్ చేస్తోన్నది రాజకీయమే కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తల్లిని తిట్టిన పార్టీతో పొత్తు ఏంటని, పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే కావడానికే ఈయన ఇంతలా పరితపిస్తున్నారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు పవన్ తీరు బలం చేకూరుస్తోంది.

అమ్మను దూషించిన పార్టీతో కలిసి వెళ్లడం ఏంటని, ఇదేం రాజకీయం పవన్ అంటూ సొంత పార్టీకి చెందిన వారే అభిప్రాయ పడుతున్నారు. నిత్యం ప్రజల తరపున ఉంటే.. ఈరోజు కాకపోయినా, ఏదో ఒక రోజు.. సీఎం అయ్యే అవకాశం ఉందని, కానీ ఇలా ప్రవర్తిస్తే.. జన్మలో ముఖ్యమంత్రి కాలేడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లింది.. సెంటిమెంట్ తో కాదని, సెటిల్ మెంట్ కోసమే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి.. తల్లిని తిట్టిన పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి