iDreamPost

రూ.750 కోట్ల మేర మోసం.. పెన్నుల కంపెనీపై సీబీఐ కేసు..

రూ.750 కోట్ల మేర మోసం.. పెన్నుల కంపెనీపై సీబీఐ కేసు..

  • రూ. 750 కోట్ల మేర మోసం చేసిన పెన్నుల కంపెనీ.. సీబీఐ కేసు నమోదు..
  • 7 బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 2,919 కోట్ల అప్పు కలిగి ఉన్న రొటోమాక్ కంపెనీ
  • ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాటా 23 శాతం
  • 2016 జూన్ 30న డీఫాల్ట్ అయిన రొటోమాక్

ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ చిక్కుల్లో పడింది. ఆ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 750 కోట్ల మేర మోసం చేసిందని రొటోమాక్ పై అభియోగాలను నమోదు చేసింది.

Rotomac Spinner Lx pack of 100 pens : Amazon.in: Office Products

కంపెనీ డైరెక్టర్లు సాధన కొఠారి, రాహుల్ కొఠారిలై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 420 (చీటింగ్) కింద అభియోగాలు మోపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియం నుంచి ఈ కంపెనీ మొత్తం రూ. 2,919 కోట్ల అప్పు కలిగి ఉంది. ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాటా 23 శాతం.

Hyderabad: Bank fraud of Rs 67.71 crores committed, CBI registers case

2016 జూన్ 30న పేమెంట్లలో ఈ కంపెనీ డిఫాల్ట్ అయింది. ఆ తర్వాత రూ. 750.54 కోట్ల బకాయితో నిరర్థక ఆస్తిగా ప్రకటించబడింది. కన్సార్టియం సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే ఈ కంపెనీపై సీబీఐ, ఈడీలు విచారణ జరిపాయి. తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి