iDreamPost

ఒకవైపు మరణాన్ని ఓడిస్తూ.. ఇంటర్ లో టాప్ ర్యాంకర్ గా! ఈ చదువుల తల్లిని కాపడుకొలేమా?

Inter Girl Top Rank: చదువుకోవాలనే పట్టుదల ఉంటే పేదరికం, అనారోగ్యం, వైకల్యం ఏవీ అడ్డు పడవని ఎంతోమంది విద్యార్థులు నిరూపించారు. కష్టపడి చదివి టాప్ ర్యాంకులు సాధిస్తున్నారు.

Inter Girl Top Rank: చదువుకోవాలనే పట్టుదల ఉంటే పేదరికం, అనారోగ్యం, వైకల్యం ఏవీ అడ్డు పడవని ఎంతోమంది విద్యార్థులు నిరూపించారు. కష్టపడి చదివి టాప్ ర్యాంకులు సాధిస్తున్నారు.

ఒకవైపు మరణాన్ని ఓడిస్తూ.. ఇంటర్ లో టాప్ ర్యాంకర్ గా! ఈ చదువుల తల్లిని కాపడుకొలేమా?

చదువు కోవాలన్న పట్టుదల ఉన్నవారికి దేవుడు అన్ని వేళలా దీవెనలు అందిస్తాడు. అంగవైకల్యం ఉన్నా.. అనారోగ్యంతో బాధపడుతున్నా.. చదువుకోవాలన్న కృషీ, పట్టుదల ఉన్నవారికి చదువుల తల్లి వెన్నంటే ఉంటుంది. ఎంతోమంది పేదరికంలో ఉన్న పట్టుదలతో చదివి టాపర్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు.  తనకు రెండు కిడ్నీలు పూర్తిగా పాడైనా.. వారానికి రెండు సార్లు డయాలసీస్ చేసుకోవాల్సి వస్తున్నా.. ఒంట్లో ఎలాంటి సత్తువ లేక కాలేజ్ కి వెళ్లకున్నా.. మొక్కవోని పట్టుదలతో సెల్ ఫోన్ ద్వారా అద్యాపకులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో సబ్జెక్ట్స్ పై అవగాణ పెంచుకొని ఏకంగా 927 మార్కులు సాధించి టాపర్ గా నిలిచి అందరిచే శభాష్ అనిపించుకుంది ఓ పేదింటి ఆడబిడ్డ. పూర్తి వివరాల్లోకి వెళితే..

పెద్దపల్లికి జిల్లా గోదావరిఖనికి చెందిన కూనరపు సిరి ఇంటర్ లో సీఈసీలో 927 మార్కులు సాధించి సత్తా చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అయితే సిరిది అందరి అమ్మాయిల పరిస్థితి కాదు. ఐదేళ్లుగా కిడ్ని వ్యాధితో బాధపడుతుంది. 8 నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా విఫలం కావడంతో వారినికి రెండు రోజులు డయాలసీస్ చేయించుకోవాల్సి వస్తుంది. అయినా మొక్కవోని దీక్షా, పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించింది. గోదావరి ఖని శారదానగర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన కూనరపు సిరి.. సీఈసీ లో 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచింది. గోదావరి ఖిని ఎన్టీపీసీ కృష్ణనగర్ కి చెందిన కూనారపు పోశం, వెంకట లక్ష్మి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. స్థానికంగా సెంట్రింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు పోశం.

పెద్ద కూతురు సిరి ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఎన్నో ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు.  8 నెలల క్రితం  సిరి కిడ్నీలు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. ప్రస్తుతం సిరికి వారానికి రెండు సార్లు రక్త శుద్ది చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది. తనకు ఆరోగ్యం బాగా లేకున్నా చదువుకోవాలన్న పట్టుదల ఆమెలో ఏమాత్రం తగ్గలేదు. సిరి పరిస్థితి తెలుసుకున్న కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపక బృందం పాఠ్యాంశాలను సెల్ ఫోన్ లో బోధించి స్నేహితుల ద్వారా చేరవేస్తూ వచ్చారు. ఏదైనా సబ్జెక్ట్ లో అనుమానం ఉంటే మెసేజ్ ద్వారా సందేహాలను నివృతి చేసేవారు. మరోవైపు సిరి పట్టుదల చూసి తల్లిదండ్రులు ఆమెకు అన్నివిధాలుగా సహకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం వచ్చిన రిజల్ట్స్ లో సిరి 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా రాణించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. తమ కూతురు కిడ్నీ మార్పిడి వైద్య చికిత్సకు ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు స్పందించి చేయూతనివ్వాలని తండ్రి పోశం విజ్ఞప్తి చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి