iDreamPost

Zaka Ashraf: పాక్ క్రికెట్​లో ముసలం.. రాజీనామా చేసిన బోర్డు ఛైర్మన్!

  • Published Jan 19, 2024 | 10:11 PMUpdated Jan 19, 2024 | 10:11 PM

వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో షాక్. ఆ దేశ క్రికెట్​కు సంబంధించిన మరో కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశారు.

వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో షాక్. ఆ దేశ క్రికెట్​కు సంబంధించిన మరో కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశారు.

  • Published Jan 19, 2024 | 10:11 PMUpdated Jan 19, 2024 | 10:11 PM
Zaka Ashraf: పాక్ క్రికెట్​లో ముసలం.. రాజీనామా చేసిన బోర్డు ఛైర్మన్!

గతేడాది ఆసియా కప్ నుంచి పాకిస్థాన్​ టీమ్​కు ఏదీ కలసి రావడం లేదు. ఆ టోర్నీలో ఫైనల్​కు చేరుకోలేకపోయిన దాయాది జట్టు తమ ఆటతీరుతో కూడా అందర్నీ నిరాశపర్చింది. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్​-2023లో కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగి తుస్సుమంది. సెమీఫైనల్​కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి అవమానకర రీతిలో బయటకు వచ్చేసింది పాక్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి టాప్ టీమ్స్​తో పాటు ఆఫ్ఘానిస్థాన్ లాంటి చిన్న జట్టు చేతిలోనూ ఓడి తీవ్ర విమర్శల్ని మూటగట్టుకుంది. పాక్ ప్లేయర్ల ఆటతీరుపై సొంత దేశ అభిమానులే ట్రోలింగ్​కు దిగారు. ఇదేం బ్యాటింగ్, ఇదేం ఫీల్డింగ్ అంటూ విరుచుకుపడ్డారు. దీని ఎఫెక్ట్ పాకిస్థాన్ క్రికెట్ మీద బలంగా పడింది. వరల్డ్ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఒక్కొక్కరుగా పాక్ క్రికెట్​లో కీలక వ్యక్తులు రిజైన్ చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ జకా అష్రాఫ్ తన పదవి నుంచి తప్పుకున్నారు.

పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జకా అష్రఫ్ తెలిపారు. పాకిస్థాన్​ క్రికెట్​ను మరింత మెరుగుపర్చడం కోసం తాను పని చేశానన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్క్ చేయడం కుదరదన్నారు. ‘క్రికెట్ బెటర్​మెంట్ కోసం నేను కృషి చేశా. కానీ ఇప్పుడు పని చేయడం కుదరదు. ఈ పరిస్థితుల్లో నేను వర్క్ చేయలేను. నా తర్వాత నెక్స్ట్ పీసీబీకి ఎవరు ఛైర్మన్​గా ఉండాలనేది ప్రధాన మంత్రి నిర్ణయిస్తారు. ఆ పోస్టుకు ఎవర్ని నామినేట్ చేయాలనేది పూర్తిగా ఆయన డిసిషన్’ అని చెప్పుకొచ్చారు జకా అష్రఫ్. ఇక, ఆయన కంటే ముందు నజమ్ సేథీ ఆ పదవిలో ఉన్నారు. అయితే జులై 6, 2023 నుంచి ఛైర్మన్​గా పీసీబీ బాధ్యతలు చేపట్టిన జకా అష్రఫ్.. ఏడాది తిరగకుండానే ఆ పోస్టుకు రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జకా అష్రఫ్ రాజీనామా పాకిస్థాన్ క్రికెట్​లో మరో భారీ కుదుపు అనే చెప్పాలి. నిన్న (గురువారం)నే పాక్ కోచ్ పదవి నుంచి మికీ ఆర్థర్ తప్పుకున్నారు. ఆయనతో పాటు టీమ్ హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్​బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి తమ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పాక్ క్రికెట్​తో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని వాళ్లు వెల్లడించారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఏకంగా ఛైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి తన పోస్టు నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. అసలు పాక్ క్రికెట్​లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. వరుస ఓటములతో టీమ్ డీలాపడ్డ ఈ టైమ్​లో ఈ రాజీనామాల పర్వం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండ్రోజుల వ్యవధిలో నలుగురు కీలక వ్యక్తులు తప్పుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. పాక్ క్రికెట్​ను త్వరగా చక్కదిద్దాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. పాక్ క్రికెట్​లో ముసలం నెలకొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి