iDreamPost

టాలీవుడ్ కి పాయల్ నేర్పిన పాఠం! కాస్త ఆలోచించాలి మరి!

మంగళవారం సినిమా నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది...

మంగళవారం సినిమా నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది...

టాలీవుడ్ కి పాయల్ నేర్పిన పాఠం! కాస్త ఆలోచించాలి మరి!

 ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో ఆడియన్సును తన వైపుకు తిప్పుకుంది హీరోయిన్‌ పాయల్ రాజ్‌పుత్‌. ఆ చిత్రం తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే , ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఇటీవల విడుదులైన “మంగళవారం” చిత్రంతో.. తన స్పెషల్ క్రేజ్ ను తిరిగి సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇక దర్శకుడు ‘అజయ్ భూపతి’ ఈసారి బలమైన స్క్రిప్ట్ తో సాహసం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇండస్ట్రీలో ‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్ లలో సక్సెఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మూవీ.. టాలీవుడ్ కి ఓ కొత్త పాఠం నేర్పించిందన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య భారీ మార్పులే వచ్చాయి. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ ఎక్కువ అయ్యాక బడ్జెట్ కంట్రోల్ అన్నది లేకుండానే పోయింది. ఎన్ని వందల కోట్లు కుమ్మరిస్తే అంత మంచి సినిమా అవుద్దన్న లెక్కలోకి మేకర్స్ వెళ్లిపోయారు. ఆడియన్స్ కూడా ఆ సినిమాలకి బ్రహ్మరథం పట్టి సూపర్ సక్సెస్ చేస్తూ వచ్చారు. దీంతో.. చిన్న బడ్జెట్ తో కంటెంట్ బేస్డ్ మూవీస్ చేయడానికి కూడా స్టార్ ప్రొడ్యూసర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది.

అల్లు అరవింద్ అంతటి నిర్మాత.. మూవీ మేకింగ్ లో రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోయింది కాబట్టే.. సినిమాలకి దూరంగా ఉంటున్నాను అని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ.., మంగళవారం సక్సెస్.. ఆ లెక్కను మార్చి లాభాల పంట పండిస్తోంది. తక్కువ బడ్జెట్ తో చేసే చిన్న సినిమాలు.. పెద్ద విజయం సాధిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేసింది. పెద్ద సినిమా చేస్తేనే.. ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే పట్టించుకోరేమో అనే ఆలోచనని కూడా మంగళవారం సక్సెస్ తుడిచేసినట్టు అయ్యింది. ఇక మంగళవారం సినిమాలో పాయల్ ‘శైలు’ పాత్రలో జీవించింది అని చెప్పి తీరాల్సిందే. ఇప్పటివరకు వచ్చిన చాలా మూవీస్ లో పాయల్ గ్లామర్ గర్ల్ గానే కనిపించింది. కాగా.. ‘మంగళవారం’ చిత్రంతో ఆమెలోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది.

కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. ‘ప్రస్తుతం ఈ సినిమా నాలుగోవ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏదేమైనా పెద్ద సినిమాలు తీస్తేనే ఇండస్ట్రీలో ఉండాలి. లేకుంటే.. లేదు అనే మేకర్స్ ఆలోచనని ఈ మూవీ తుడిచేయడం చాలా మంచి పాఠంగా చెపుకోవచ్చు. ఎందుకంటే.. వందల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టించి, 2 ఏళ్ళకి ఒక్క సినిమా చేసే స్టార్స్ వల్ల మాత్రమే ఇండస్ట్రీ బతకడం లేదు. ఇక్కడ చిన్న సినిమా సైతం రోజుకి వందల మందికి అన్నం పెడుతోంది. వారి ఆశలను తీరుస్తోంది. కాబట్టే.. చిన్న సినిమా ఉంటేనే ఇండస్ట్రీ సేఫ్ గా ఉన్నట్టు. అలాంటి చిన్న సినిమాలు చేసే ఎంతో మంది మేకర్స్ కి ఒక ఆశ కల్పించిన మంగళవారం మూవీ టీమ్ ని నిజంగా అభినందించడంలో తప్పే లేదు . మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి