iDreamPost

పవన్ బ్లాక్ బస్టర్ మళ్ళీ విడుదల

పవన్ బ్లాక్ బస్టర్ మళ్ళీ విడుదల

అసలు ఇప్పుడు కొత్త సినిమాలకే థియేటర్లలో కలెక్షన్లు సరిగా రావడం లేదు. అలాంటిది పాతవి వేస్తే జనం చూస్తారా. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మేము రెడీ అంటున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాల్లో వంద కేంద్రాల్లో గబ్బర్ సింగ్ షోలు ప్లాన్ చేశారు. ఆ మేరకు ట్విట్టర్ లో చెప్పేశారు. అయితే ఊహించని రీతిలో పవన్ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తమకూ ప్రీమియర్లు వేయమని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గణేష్ ఎవరి ఊరిలో వాళ్ళు ఒక థియేటర్ ను షోకు బుక్ చేసుకుంటే కాపీ పంపించి అనుమతులు ఇస్తానని హామీ ఇస్తున్నారు. చూస్తుంటే కౌంట్ గట్టిగానే పెరిగేలా ఉంది.

పవన్ మాస్ హిస్టీరియాని పీక్స్ లో చూపించిన సినిమాగా గబ్బర్ సింగ్ అంటే ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన లవ్ ఉంది. దాన్ని ఇలా బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పైన చెప్పిన కౌంట్ రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదు. ఇటీవలి కాలంలో పాత బ్లాక్ బస్టర్స్ ని అభిమానుల కోసం స్పెషల్ గా వేయడం కొత్త ట్రెండ్ గా మారింది. ఆ మధ్య మగధీర, ఆదిలను హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో వేస్తే రెండు హౌస్ ఫుల్ బోర్డులు వేసుకున్నాయి. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రాలోనూ మహేష్ బాబు చిత్రాలు ఇలా వేసుకున్న దాఖలాలు ఉన్నాయి. తమ హీరోల కొత్త సినిమాలు లేట్ అయ్యేకొద్దీ ఈ రూపంలో ఎంజాయ్ చేస్తామంటున్నారు ప్రేక్షకులు.

ఒకప్పుడు రీ రిలీజులు సాధారణమైన విషయం. అప్పుడు ఈ యుట్యూబ్ లు, ఇంటర్ నెట్లు, ఓటిటిలు లేవు కాబట్టి ఎవరైనా సినిమా చూడాలంటె సామాన్యులకు థియేటర్ ఒక్కటే ఆప్షన్ గా ఉండేది. అందుకే మోసగాళ్లకు మోసగాడు, దానవీరశూరకర్ణ, దేవదాసు లాంటివి రిపీట్ రన్స్ లో కూడా కలెక్షన్లతో రికార్డులు సృష్టించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా కూడా ఫ్యాన్స్ కోసం ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు జరగడం బ్లాక్ బస్టర్స్ ని థియేటర్లో మిస్ అయినవాళ్లకు మంచి అనుభూతిని ఇస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడొస్తున్న కొన్ని డిజాస్టర్ల కంటే టీవీలో చూసినవే అయినా పాత క్లాసిక్స్ ని వెండితెరపై చూడటం నయం

Also Read : అఖిల్ శర్వాలు ఫిక్స్ చేసుకున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి