iDreamPost

థియేటర్లకొస్తున్న తమ్ముడు – జల్సాకు జోడిగా

ఒకప్పుడు పాత సినిమాలు రీ రిలీజుకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆడేవి.

ఒకప్పుడు పాత సినిమాలు రీ రిలీజుకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆడేవి.

థియేటర్లకొస్తున్న తమ్ముడు – జల్సాకు జోడిగా

ఇదేం ట్రెండో అర్థం కాక ఎగ్జిబిటర్ల ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఒకప్పుడు పాత సినిమాలు రీ రిలీజుకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆడేవి. ముఖ్యంగా ఎన్టీఆర్ చిరంజీవి చిత్రాలకు భలే డిమాండ్. మాయాబజార్, లవకుశ, దానవీరశూరకర్ణ, ఖైదీ లాంటివి ఎన్నిసార్లు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. ఇప్పుడు పైరసీలు, ఓటిటిలు, యుట్యూబ్ వచ్చాక ఫ్రీగా చూసే అవకాశం పెట్టుకుని మళ్ళీ వాటినే థియేటర్ కు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేదు. ఇది నిన్నామొన్నటి దాకా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎంత ఉచిత అవకాశం ఉన్నా సరే బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.
Younger brother who plays theatre
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సాని రీ మాస్టర్ చేసి ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. అది సరిపోవడం లేదని తాజాగా తమ్ముడుని కూడా దించబోతున్నారు. అది కూడా ఒక రోజు ముందు అంటే ఆగస్ట్ 31కి ప్రీమియర్స్ వేయబోతున్నారు. హైదరాబాద్ ఐమ్యాక్స్ లో ఏకంగా 9 షోలు దాదాపు సోల్డ్ అవుట్ కావడం కొత్త రికార్డు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా హఠాత్తుగా రంగంలోకి దిగిన తమ్ముడుని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. 1999లో ఈ మూవీ వచ్చింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ప్రీతీ జింగానియా హీరోయిన్ గా రూపొందింది. రమణ గోగుల పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్స్. బొమ్మ కూడా వంద రోజులు పైగానే ఆడింది.
Jalsa Movie Re- Release
ముఖ్యంగా పవన్ బెస్ట్ కామెడీ టైమింగ్ ని తమ్ముడులో చూడొచ్చు. సాంగ్స్ యువతరాన్ని మాములుగా ఊపేయలేదు. మార్షల్ ఆర్ట్స్ రియల్ గా కెమెరా ముందు పెర్ఫార్మ్ చేయడం సంచలనం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దాన్ని తెరమీద చూడటం అంటే మంచి అనుభూతే. హైదరాబాద్ తెలంగాణలో పలు థియేటర్లలో దీన్ని స్క్రీన్ చేయబోతున్నారు. అయితే కేవలం ఒక రోజు గ్యాప్ లో జల్సా ఉండటంతో ఏదో ఒకదాన్ని చూడాలనుకుంటే మాత్రం చిక్కులు తప్పవు. అసలే కొత్త రేట్లతోనే టికెట్లు అమ్ముతున్నారు. ఆ మధ్య పోకిరి, ఒక్కడు, ఘరానా మొగుడు వరసగా సక్సెస్ అయ్యాక తగ్గించే మూడ్ లో ఎగ్జిబిటర్లు లేరు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రాబోతున్నాయో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి