iDreamPost

Pawan Kalyan: పవర్ స్టార్ సరసన కొత్తమ్మాయా

Pawan Kalyan: పవర్ స్టార్ సరసన కొత్తమ్మాయా

Pawan kalyan- Sakshi Vaidya :ప్రస్తుతం భీమ్లా నాయక్ పూర్తి చేసే పనిలో పడ్డ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీ అయిపోతారు. ఇదయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్తుంది. నెక్స్ట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ తాళ్ళూరి నిర్మించే యాక్షన్ ఎంటర్ టైనర్ ఉంటుంది. అఖిల్ తో ఏజెంట్ చిత్రీకరణలో ఉన్న సూరి పవన్ కోసం హీరోయిన్ గా సాక్షి వైద్యను లాక్ చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. నిజానికి ఈ అమ్మడు ఏజెంట్ కోసం అనుకున్నారు. కానీ చేస్తోందో లేదో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అంతర్గత సమాచారం మేరకు తాను నటించేది నిజమే అంటున్నారు సినీ జనం.

సాక్షి వైద్య ముంబై మోడల్. ఇప్పటిదాకా మూవీ డెబ్యూ జరగలేదు. కానీ మోడలింగ్ లో చాలా బిజీ. ఇప్పటిదాకా చాలా యాడ్స్ చేసింది. ఎన్నో దేశాలు తిరిగింది. సోషల్ మీడియాలో 2 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆకట్టుకునే అందం ఉన్న సాక్షి వైద్య కోసం బాలీవుడ్ దర్శకులు కూడా ట్రై చేశారు కానీ ఫైనల్ గా ఆ అమ్మాయి సౌత్ లోనే ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే సాక్షి వయసు కేవలం 21 ఏళ్ళు. మరి పవన్ పక్కన జోడిగా సూట్ అవుతుందా అనే అనుమానాలు కలగడం సహజం. దాని కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా చెప్పేదాకా కన్ఫర్మ్ చేయలేం.

ఈ సినిమాలన్నీ అయ్యాక ఎన్నికలు వస్తాయి అప్పుడు జనసేన కోసం పవన్ బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు 2022 లో రిలీజవుతాయి. ఆపై భవదీయుడు భగత్ సింగ్ 2023లో సురేందర్ రెడ్డి మూవీ 2024 లేదా అంతకన్నా ముందు రావొచ్చు. ఎలక్షన్ల సమయం కాబట్టి పవర్ స్టార్ బ్రేక్ తీసుకున్నాడనే మెసేజ్ జనంలోకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఇంకోటేదైనా వేగంగా రీమేక్ సినిమా చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి మంచి ప్లానింగ్ తో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో అభిమానులను కంటిన్యూగా అలరించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

ALSO READ – నాగార్జునకు అంత నమ్మకం ఏమిటో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి