iDreamPost

జనసేనాని లుక్ మార్చారు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

జనసేనాని లుక్ మార్చారు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

గత కొంతకాలంగా రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపిన జనసేనాని మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో తమ అభిమాన నటుడు సినిమాల్లో తిరిగి నటిస్తున్నాడని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. కాగా గత కొంతకాలంగా గుబురు గెడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ తాజాగా క్లీన్ షేవ్ తో కనిపించడంతో అయన అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు..

రెండేళ్లుగా గెడ్డంతో కనిపించిన పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల కోసమే లుక్ మార్చారని ప్రచారం జరుగుతుంది.పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంల జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గుబురు గెడ్డం లేకుండా మొదటిసారి కనిపించారు. సినిమాల్లో నటిస్తున్నందునే లుక్ మార్చారని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా మూడు సినిమాలు పట్టాలెక్కాయి. మొదటిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. పింక్ రీమేక్ తదుపరి సినిమాగా క్రిష్ దర్శకత్వంలో ఒకటి ,ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమాలో వరుసగా నటిస్తున్నట్లు సమాచారం. పాత పవన్ కళ్యాణ్ ని గుర్తుకు తెచ్చేలా ఒత్తైన జుట్టుతో, క్లీన్ షేవ్ తో కనిపించే సరికి పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి