iDreamPost

పవిత్ర, చంద్రకాంత్‌ల లవ్‌ స్టోరీ.. ఎవరికి తెలియని నిజాలు!

త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరామ్, చంద్రకాంత్ ల మరణాలు ఇండస్ట్రీని షాక్ కు గురిచేశాయి. ఈ నేపథ్యంలో వారి లవ్ స్టోరీ తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. వారి లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరామ్, చంద్రకాంత్ ల మరణాలు ఇండస్ట్రీని షాక్ కు గురిచేశాయి. ఈ నేపథ్యంలో వారి లవ్ స్టోరీ తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. వారి లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పవిత్ర, చంద్రకాంత్‌ల లవ్‌ స్టోరీ.. ఎవరికి తెలియని నిజాలు!

త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరామ్ కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదంలో మరణించిన విషాద సంఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ సంఘటన మరవకముందే.. మరో విషాదం ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. పవిత్ర మరణాన్ని తట్టుకోలేక నటుడు చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ న్యూస్ విన్న బుల్లితెర ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ నేపథ్యంలో పవిత్ర, చంద్రకాంత్ ల లవ్ స్టోరీ ఏంటి? తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత, వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమలో ఎవ్వరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పవిత్ర జయరామ్-చంద్రకాంత్ లు భార్యాభర్తలు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వీరు భార్యాభర్తలు కాదు. ఇక వీరి లవ్ స్టోరీ త్రినయని సీరియల్ చేస్తున్న క్రమంలోనే స్టార్ట్ అయ్యింది. ఇంతకు ముందే పవిత్రకు వేరే వ్యక్తితో పెళ్లి అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయి ఒంటరిగానే ఉంటుంది పవిత్ర. ఆమెకు ఇద్దరు సంతానం. ఇక చంద్రకాంత్ కు సైతం పెళ్లైంది. అతడు కూడా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. తమ జీవితాల్లో ఉన్న విషాద సంఘటనలను మరచిపోయి ఇద్దరు కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.

ఈ క్రమంలోనే త్రినయని సీరియల్ లో ఇద్దరికి కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ సీరియల్ జరుగుతున్న సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఇద్దరూ ఒక్కటౌవ్వాలని అనుకున్నారు. తద్వారా తమ రిలేషన్ గురించి అందరికి తెలియజేయాలనుకున్నారు. తమ జంట గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నా తమ ప్రేమ పవిత్రమైనదని పెళ్లి ద్వారా ఈ ప్రపంచానికి తెలియజెప్పాలని చూశారు. కానీ ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో పవిత్ర మరణించడం, ఆమె మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ సైతం ఆత్మహత్య చేసుకోడంతో వారి ప్రేమ విషాదంగా మారింది. మరి పవిత్ర-చంద్రకాంత్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి