iDreamPost

హాలీవుడ్ ప్రమాణాలతో పఠాన్ విన్యాసాలు

హాలీవుడ్ ప్రమాణాలతో పఠాన్ విన్యాసాలు

2018 చివర్లో రిలీజైన జీరో డిజాస్టర్ షారుఖ్ ఖాన్ ఎప్పటికీ మర్చిపోలేని పీడకల. దాని దెబ్బకు అప్పటికే వరస వైఫల్యాలతో నిరాశలో ఉన్న బాద్షా ఏకంగా రెండేళ్లకు పైగానే ఖాళీగా ఉన్నాడు. అభిమానులు కోరుకుంటున్న దానికి తాను ఎంచుకుంటున్న కథలకు చాలా వ్యత్యాసం ఉందని గుర్తించాడు. అప్పుడు వచ్చిన కథే పఠాన్. యష్ రాజ్ సంస్థ నూటా యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ జనవరి 25న రిపబ్లిక్ డేని టార్గెట్ గా చేసుకుని రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఒకప్పటి జోష్ తీసుకొచ్చే మూవీగా దీని మీడియా ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూటర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ ట్రైలర్ ని లాంచ్ చేశారు

స్టోరీ పరంగా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రిస్క్ చేయలేదు. చాలాసార్లు వచ్చిన పాయింట్ నే తీసుకున్నాడు. భారతదేశం మీద దాడులు చేసేందుకు ఒక టెర్రరిస్టు లీడర్(జాన్ అబ్రహం)కు కాంటాక్ట్ ఇస్తుంది పాకిస్థాన్ కు చెందిన ఒక సంస్థ. దాన్ని ఒప్పుకున్న అతగాడు ఏకంగా మన గవర్నమెంట్ కే ఫోన్ చేసి మరీ విధ్వంసం సృష్టిస్తానని బెదిరిస్తాడు. దీంతో విధులకు దూరంగా ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న సీక్రెట్ ఏజెంట్ పఠాన్(షారుఖ్ ఖాన్)ని పిలిపిస్తారు. మరో ఆడ గూఢచారి(దీపికా పదుకునే) సహాయంతో బరిలో దిగిన పఠాన్ ఎట్టకేలకు దేశం కోసం వాళ్ళ కుట్రల్ని భగ్నం చేసి లక్ష్యం సాధిస్తాడు. ఇదెలా జరుగుతుందనేది తెరమీద మాత్రమే చూడమంటున్నారు

సిద్దార్థ్ ఆనంద్ టేకింగ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ఉన్నాయి. ఏ మాత్రం నమ్మేలా ఉండని అవుట్ అఫ్ ది ఫిజిక్స్ పోరాటాలను ఇందులోనూ పొందుపరిచాడు. హృతిక్ రోషన్ తో తీసిన గత చిత్రం వార్ లో ఇలాంటి వాటిని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడంతో పఠాన్ లో డోస్ విపరీతంగా పెంచేశాడు. కొన్ని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉన్న మాట వాస్తవం. యష్ సంస్థ బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడలేదని అర్థమవుతోంది. అయితే టైగర్ శ్రోఫ్ లాంటి అప్ కమింగ్ హీరోలు చేస్తున్న ఇలాంటి సినిమాల్లో షారుఖ్ ఖాన్ లాంటి బడా స్టార్ ని ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. హిందీతో పాటు తమిళ మలయాళం కన్నడ తెలుగులోనూ పఠాన్ రిలీజ్ కానుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి