iDreamPost

అంకుల్ శ్యామ్ వస్తున్నాడు.. పాన్ షాపులు ముసేయండి..

అంకుల్ శ్యామ్ వస్తున్నాడు.. పాన్ షాపులు ముసేయండి..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్నవేళ గుజరాత్ ప్రభుత్వం కొత్తకొత్త రూల్స్ తెస్తున్నది. మురికివాడలు, మురికి కాలువలు కనిపించకుండా ఆదరాబాదరా లక్షలు ఖర్చు పెట్టి గోడలు కట్టి మురికివాడలను ట్రంప్ కనిపించకుండా దాచేస్తున్న గుజరాత్ ఇప్పుడు మరో కొత్త రూల్ పాస్ చేసింది. అహ్మదాబాద్ లో ఉన్న పాన్ షాపులన్నీ ఈ నెల 24న మూసేయాలని ఆదేశించింది.

పాన్ మసాలాలు నమిలేసి గోడలనిండా ఉమ్ముతూ ఖరాబ్ చేస్తున్నారని సర్కార్ భావిస్తోంది.అందుకే 24న పాన్ షాపులన్నీ మూసేయాలని, గోడల మీద మరకలన్నీ శుభ్రం చేసి నీట్ గా ఉంచాలని అహ్మదాబాద్ నగరపాలక సంస్థ సిబ్బందిని ఆదేశించింది. ఇక ఈ రెండు మూడురోజుల్లో ఇంకెన్ని కొత్త రూల్స్ వస్తాయో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

24న డోనాల్డ్ ట్రంప్ ప్రయాణించే ఏరియాలో సర్దార్ నగర్ ప్రాంతములో బోలెడు మురికివాడలున్నాయి.. అక్కడక్కడా అక్రమ నిర్మాణాలు, అస్తవ్యస్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అవన్నీ ట్రంప్ కంట పడకుండా 400 మీటర్ల పొడవునా, 4 అడుగుల ఎత్తులో గోడ నిర్మించి ఈ మురికివాడలను ట్రంప్ కంట పడకుండా దాచాలన్నని గుజరాత్ సర్కార్ ఆలోచన. ఇప్పుడు ఏకంగా పాన్ దుకాణాలు సైతం మూసేయడం మరింత విడ్డూరం అని ప్రజలు అంటున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి