iDreamPost

ఇండియాపై ఘనవిజయం సాధించిన పాలస్తీనా!

  • Published Oct 12, 2023 | 11:07 AMUpdated Oct 12, 2023 | 11:07 AM
  • Published Oct 12, 2023 | 11:07 AMUpdated Oct 12, 2023 | 11:07 AM
ఇండియాపై ఘనవిజయం సాధించిన పాలస్తీనా!

ఓ వైపు ఇజ్రాయెల్‌తో భీకర పోరు కొనసాగిస్తున్న పాలస్తీనా మరోవైపు క్రీడల్లో సత్తాచాటుతోంది. థాయ్‌లాండ్‌ వేదికగా ఏఎఫ్‌సీ ఫుట్సల్ ఆసియా కప్ 2024లో భాగంగా జరుగుతున్న క్వాలిఫైయర్స్‌లో టీమిండియాపై పాలస్తీనా విజయం సాధించింది. గ్రూప్‌-ఈలో జరుగుతున్న పోటీల్లో బుధవారం పాలస్తీనా-ఇండియా జట్లు తలపడ్డాయి. ఈ గేమ్‌లో పాలస్తీనా ఆటగాడు మౌసా హరారా మూడో నిమిషంలో తొలి గోల్‌తో పాలస్తీనా ఖాతా తెరిచాడు. మరో నిమిషం తర్వాత జహెర్ అల్సమాహి గోల్‌ చేయడంతో 2-0 ఆధిక్యం సంపాదించారు.

ఇండియా తరఫున డేవిడ్ లాల్ట్‌లన్‌సంగా ఐదో నిమిషయంలో గోల్‌ చేయడంతో భారత్‌ స్కోర్‌ మొదలుపెట్టింది. పాలస్తీనా ఆధిక్యాన్ని 1-2కి తగ్గించింది. సగం ఆట ముగిసే సమయానికి ఇండియానే 4-3తో లీడింగ్‌లో నిలిచింది. ఇక ఆట 23వ నిమిషంలో అహ్మద్ మస్రీయా పాలస్తీనాకు గోల్‌ అందించి స్కోర్‌ను సమం చేశాడు. అయితే.. 28వ నిమిషయంలో కె రోలువాపుయా గోల్‌ చేయడంతో భారత్ ఆధిక్యాన్ని తిరిగి పొందింది. అయితే, పాలస్తీనా 35వ నిమిషంలో అహ్మద్ మహ్మద్ గోల్‌, ఆ తర్వాత ఫహ్జన్ గోల్‌ చేయడంతో లీడ్‌ పొందింది. దీంతో 6-5తో పాలస్తీనా, భారత్‌పై విజయం సాధించింది. మరి ఈ ఇండియాపై పాలస్తీనా విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి