iDreamPost

టీడీపీ గట్టి షాక్.. YSRCPలో చేరిన కీలక నేత!

ఏపీలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలందరూ వైఎస్సార్ సీపీలో జాయిన్ అవుతున్నారు. ఇటీవలే మాచర్ల టీడీపీ నేత చలమారెడ్డి వైసీపీలో చేరారు. తాజాగా పుంగనూరుకు చెందిన కీలక నేత కూడా వైఎస్సార్ సీపీలో చేరారు.

ఏపీలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలందరూ వైఎస్సార్ సీపీలో జాయిన్ అవుతున్నారు. ఇటీవలే మాచర్ల టీడీపీ నేత చలమారెడ్డి వైసీపీలో చేరారు. తాజాగా పుంగనూరుకు చెందిన కీలక నేత కూడా వైఎస్సార్ సీపీలో చేరారు.

టీడీపీ గట్టి షాక్.. YSRCPలో చేరిన కీలక నేత!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది  నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా  అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వైఎస్సార్ సీపీ అధినేత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే 11 నియోజవర్గాలకు ఇంఛార్జీలను మార్చారు. ఇదే సమయంలో వైసీపీ గెలుపు ఖాయమనే వాతావరణం కనిపిస్తుండటంతో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇటీవలే మాచర్ల టీడీపీ నేత చలమారెడ్డి వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకి చిత్తూరు జిల్లాలో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గానికి చెందిన  టీడీపీ నేత ఆర్వీ సుభాష్ చంద్రబోష్ వైఎస్సార్ సీపీలో జాయిన అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుభాష్ చంద్రబోష్ పార్టీ కండువ కప్పుకున్నారు. శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి సుభాష్ చంద్రబోష్ జాయిన్‌ అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్‌ గౌడ పాల్గొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి ఆర్‌వీ సుభాష్‌ చంద్రబోస్‌ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

2014 టీడీపీ తరపున ఆర్వీ సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఆ సమయంలో వైఎస్సార్ సీపీ తరపున ఎన్. అమర్ నాథ్ రెడ్డి పోటీ చేశారు. సుభాష్ పై అమర్ నాథ్ రెడ్డి  2,850 స్వల్ప మెజార్టీతో  గెలుపొందారు. ఆ ఎన్నికల్లో సుభాష్ కు  93, 833 ఓట్లు పోలయ్యాయి. అమర్ నాథ్ రెడ్డికి 96,683 ఓట్లు పోలయ్యాయి. 2014 వైసీపీ తరపున గెలిచిన అమర్ నాథ్ రెడ్డి.. ఆ తరువాత టీడీపీలో చేరి..మంత్రిగా బాధ్యతలు చెపట్టారు.  2019లో జరిగిన ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ కి టీడీపీ టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన అమర్ నాథ్ రెడ్డి పోటీ చేసి 32, 246 భారీ ఓట్లతో ఓటమి పాలయ్యాడు. అమర్ నాథ్ రెడ్డిపై ఎన్ వెంకట్ గౌడ్ విజయం సాధించారు. పలమనేరులో  సుభాష్ కి మంచి ఓటు బ్యాంకు ఉంది. తాజాగా వైఎస్సార్ సీపీలో చేరాడంతో ఆ పార్టీ బలం పుంజుకోగా.. టీడీపీకి మరింత దెబ్బతగిలింది.  మరి.. ఇలా వైసీపీలోకి వరుస చేరికలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి