iDreamPost

కరోనా సాకుతో ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించిన పాకిస్థాన్

కరోనా సాకుతో ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించిన పాకిస్థాన్

కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు పాకిస్తాన్ జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల పాలిట వరంగా మారింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ సోకుతుందన్న కారణంతో పాకిస్థాన్ ప్రభుత్వం వారిని ఇళ్లకు పంపింది.

పాకిస్తాన్ కు బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఎఫ్‌ఏటీఎఫ్‌ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకున్న పాకిస్థాన్ ప్రభుత్వం గత కొన్ని నెలల్లో చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది. కాగా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుండడం ఇప్పుడు ఉగ్రవాదులకు వరంగా మారింది.. కరోనా వైరస్ ఇప్పటికే పాకిస్థాన్ జైళ్లలో ఉన్న 50 మందికి సోకినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించి ఉగ్రవాదులకు కరోనా సోకే అవకాశం ఉందంటూ అన్ని జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేస్తోంది.

అలా విడుదలైన వారిలో లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ సయీద్‌ తో పాటు అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారు. అమెరికా పాకిస్థాన్ పై చేసిన ఒత్తిడితో భద్రతా మండలి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్థాన్ కోర్టు లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ సయీద్‌ కు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హఫీజ్‌ సయీద్‌ ను తమకు అప్పగించాలని, ముంబై పేలుళ్లతో పాటు భారతదేశంలో విధ్వంసాలకు కుట్రలు పన్నాడని భారత దేశం కోరుతున్న విషయం తెలిసిందే. కానీ పాకిస్థాన్ మాత్రం భారత దేశ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. భారత్‌ అంతర్జాతీయంగా తెచ్చిన ఒత్తిడితో పాక్‌ ప్రభుత్వం అతడిని జైలు నుండి విడుదల చేసి గృహనిర్బంధంలో పెట్టింది.

ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో పాకిస్తాన్ కు చెందిన 7,600 మంది ఉగ్రవాదులు ఉండగా 1,800 మందిని ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించిందని అమెరికాకు చెందిన ‘కస్టలెమ్‌.ఏఐ’ అనే స్టార్టప్‌ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో ముంబై పేలుళ్ల మాస్టర్‌ మైండ్‌ జకీ-ఉర్‌-రెహ్మాన్‌ లఖ్వీ కూడా ఉన్నాడు. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం కశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పురిగొల్పుతోంది. కరోనా రోగులను సరిహద్దు గుండా పంపి వైరస్ వ్యాప్తికి కుట్ర పన్నుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి