iDreamPost

పాక్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు.. వారిని టార్గెట్ చేసిందెవరు..?

భారత దేశ స్వాతంత్య్రానికి ముందు, తర్వాత భౌగోళిక పరిస్థితులు తారుమారు అయ్యాయి. భారత్ నుండి పాకిస్తాన్ విడబడింది. భారత్ రిపబ్లిక్ దేశంగా, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఆవిర్భవించాయి. అయితే ఈ సమయంలోనే రక్తం ఏరులై పారింది.

భారత దేశ స్వాతంత్య్రానికి ముందు, తర్వాత భౌగోళిక పరిస్థితులు తారుమారు అయ్యాయి. భారత్ నుండి పాకిస్తాన్ విడబడింది. భారత్ రిపబ్లిక్ దేశంగా, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఆవిర్భవించాయి. అయితే ఈ సమయంలోనే రక్తం ఏరులై పారింది.

పాక్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు.. వారిని టార్గెట్ చేసిందెవరు..?

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే దేశ విభజన జరిగింది. దేశం రెండు ముక్కలు అయ్యింది. భారత్- పాక్ దేశాలు ఆవిర్భవించాయి. ఆ సమయంలో మారణకాండ చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ బద్దశత్రువులుగా మారిపోయాయి. ఇప్పటికీ కూడా కాశ్మీర్ తమదంటే తమదని గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే భారత్‌ను శత్రుదేశంగా భావిస్తూ ఉంటుంది పాకిస్తాన్. దేశాన్ని నాశనం చేసేందుకు బాంబు దాడులు, ఆత్మహుతి దాడులకు పలుమార్లు పాల్పడింది. భారత్.. పాక్ నుండి ఎన్ని సార్లు దాడులను ఎదుర్కొందో..అంత అభివృద్ధి చెందుతోంది. పాక్ మాత్రం.. ముష్కరులకు, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, పెంచి పోషిస్తూ.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది.

ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోస్ట్ హ్యాపీ నెస్ విషయం ఏంటంటే..? ఆ దేశంలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెరర్రిస్టులు వరుసగా హత్యలకు గురి కావడం.. ఒకరు కాదూ, ఇద్దరు కాదూ.. ఏకంగా 20 మందికి పైగా ఉగ్రవాదులు మర్డర్ అయ్యారు.  తాజాగా దేశాన్ని గడగడలాడించి, పరాయి దేశ పంచన చేరి తలదాచుకుంటున్న గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగంతో.. మరోసారి చర్చ జరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న లేదా డెవలప్ కంట్రీలను టార్గెట్ చేసే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను టార్గెట్ చేస్తుంది ఎవరన్న సందేహం కలుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు.. భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పై తూటాలతో దాడి చేసి చంపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్రవాదుల ఏరివేత మొదలైంది. భారత్ నిషేధించిన ఉగ్రవాద, తీవ్ర వాద సంస్థల జాబితాలో ఒకటైన హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్‌ దాయాదీ దేశానికి పేలుడు పదార్థాలు, ఆయుధాలను అక్రమంగా తరలించేవాడు. గత ఏడాది అతడిని భారత్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. రావల్పిండిలోని ఓ షాప్ వద్ద పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఇంతియాజ్‌పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత జమ్ముకాశ్మీర్‍లోని అతడి ఆస్తులను ఎన్ఐఎ భారత్ ఎటాచ్ చేసింది. ఇంతియాజ్ హత్య జరిగిన ఆరు రోజులకే.. విద్యావేత్త సయ్యద్ ఖలీద్ రజాను కూడా ఆగంతకులు హతమార్చారు.

భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థ అల్-బద్ర్ మాజీ కమాండర్ ఖలీద్‌ను అతడి ఇంటి వద్దే తలపై కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే ఈ దాడికి తామే కారణమని ప్రకటించుకుంది సింథి టెర్రరిస్ట్ గ్రూప్. ఆ వెంటనే జైషే మహ్మద్ ఉగ్రవాది, 1999 కాందహార్ విమానం హైజాకర్లలో ఒకడైన మిస్త్రీ జహుర్ ఇబ్రహీం మార్చి 1 న హత్య గావించబడ్డాడు. హనీమున్ ముగించుకుని భారత్ తిరిగి వస్తున్న రూపిన్ కత్యాల్‌ను హైజాక్ విమానంలో కత్తితో పొడిచి చంపింది మిస్త్రీనే. పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ హత్య చోటుచేసుకుంది. అదే నెలలో ఖైబుర్ ఫంఖ్తుఖ్వా రీజియన్‌లో సయ్యద్ నూర్ షాలోబర్ హత్య జరిగింది. షాలోబర్ పాక్ ఆర్మీ, ఐఎస్ఐతో కలిసి కశ్మీర్‌లో ఉగ్రదాడుల కోసం తీవ్రవాదులను రిక్రూట్ చేసేవాడు.

ఇదే మార్చి నెలలో ఖలిస్తాన్ కమాండర్ ఫోర్స్ చీఫ్ పరమ్ జీత్ సింగ్ పంజ్వార్ .. లాహోర్ లోని తన ఇంటి దగ్గర హత్యకు గురయ్యాడు. మార్చి తర్వాత కొంచెం గ్యాప్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. ఆగస్టు 1న ముంబయి అల్లర్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు సర్దార్ హుస్సేన్ అరైన్ సింధ్‌లో హత్యకు గురయ్యాడు. జనవరిలో రాజౌరి జిల్లాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకరైన అబు ఖాజిమ్ కశ్మీరీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇదిలా ఉంటే.. ఐఎస్ఐ ఏజెంట్ అనుమానితుడిగా ఉన్న లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ సెప్టెంబర్ 19న మర్డర్ అయ్యాడు.

లష్కరే తోయిబా సభ్యుడు మౌలానా జిహార్ రెహ్మాన్ ఇలాగే హత్యకు గురయ్యాడు. జైషే మహ్మద్ ఉగ్రవాది షహీద్ లతీఫ్, మౌలానా మజూద్ అజ్‌హర్ సన్నిహితుడు దావూద్ మాలిక్, ఖ్వాజా షాహిద్, అక్రమ్ ఖాన్ ఘాజీ, మౌలానా రహీమ్ ఉల్లాహ్ తరీఖ్ వంటి వారంతా ఆగంతకుల చేతిలో.. బుల్లెట్ల దాడిలో హత్యకు గురయ్యారు. అయితే ఒక ఉగ్రవాదిని హతం చేస్తే.. దానికి తామే కారణం అని చెప్పుకునేవి మరో ఉగ్రవాద, రైవల్ సంస్థలు. కానీ ఈ హత్యలకు కారణం ఎవ్వరో తెలియడం లేదు. అలాగే ఇప్పుడు దావూద్ పై విష ప్రయోగం వెనుక కారకులు, కారణాలు తెలియడం లేదు. మన చేతికి మట్టి అంటకుండా.. ఈ హత్యలు చేస్తున్నారు. మరీ ఉగ్రవాదులు వరుసపెట్టి హతం అవ్వడం వెనుక కారణాలు ఏమై ఉంటాయని అనుకుంటున్నారో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి