iDreamPost

పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఫైన్ వేసిన పోలీసులు.. ఎందుకంటే?

  • Author singhj Updated - 02:05 PM, Tue - 26 September 23
  • Author singhj Updated - 02:05 PM, Tue - 26 September 23
పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఫైన్ వేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచ కప్ గురించే వినిపిస్తోంది. క్రికెట్​లో అతిపెద్ద మహాసంగ్రామానికి సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని రోజుల్లో మెగాటోర్నీకి తెరలేవనుంది. అన్ని టీమ్స్ కప్ వేటలో ముందుకెళ్లేందుకు వ్యహాలు పన్నుతున్నాయి. ఏ జట్టును ఎలా ఓడించాలో ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్​ను ఎగరేసుకుపోవాలని దాయాది పాకిస్థాన్ కూడా అనుకుంటోంది. అయితే ఆ జట్టును మాత్రం అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు తాజాగా ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజంకు పోలీసులు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.

అతి వేగంతో కారు నడిపినందుకు బాబర్ ఆజంకు పోలీసులు ఫైన్ వేశారట. హైవే మీద పాక్ కెప్టెన్ తన ఆడి కారును పరిమితికి మించిన వేగంతో నడిపాడని సమాచారం. ఫుల్ స్పీడుతో దూసుకెళ్తున్న బాబర్​ కారును గమనించిన పంజాబ్ మోటార్​వే పోలీసులు అతడి కారును ఆపి ఫైన్ వేసినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. అయితే బాబర్​కు ఎంత జరిమానా విధించారనేది మాత్రం బయటకు రాలేదు. కాగా, బాబర్ ఇలా ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం ఇది మొదటిసారేమీ కాదు. తన కారుకు సరైన నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తూ గతంలో ఒకసారి దొరికిపోయాడు.

ఇక, వన్డే ప్రపంచ కప్​లో పాల్గొనేందుకు పాకిస్థాన్​ టీమ్​కు మార్గం సుగమమైంది. భారత్​కు రావాల్సిన పాక్ జట్టుకు వీసా సమస్య వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమస్య గురించి ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం లేఖ రాసింది. అయితే అదే రోజు పాక్ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి వీసాలు మంజూరు చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ ఆమోదముద్ర వేసింది. దీంతో బుధవారం తెల్లవారుజామున దాయాది జట్టు లాహోర్ నుంచి బయల్దేరనుంది. ఆ టీమ్ దుబాయ్ మీదుగా అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్​కు చేరుకుంటుంది. పాక్ టీమ్ ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం నాడు న్యూజిలాండ్​తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి