iDreamPost
android-app
ios-app

Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు.. చిరంజీవికి అవన్నీ ఫ్రీగా ఇస్తారా?

  • Published Jan 27, 2024 | 10:49 AM Updated Updated Jan 27, 2024 | 10:49 AM

పద్మ విభూషణ్ అవార్డుతో పాటుగా మెగాస్టార్ కు ఎలాంటి సదుపాయాలు ఉచితంగా లభిస్తాయి? అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

పద్మ విభూషణ్ అవార్డుతో పాటుగా మెగాస్టార్ కు ఎలాంటి సదుపాయాలు ఉచితంగా లభిస్తాయి? అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు.. చిరంజీవికి అవన్నీ ఫ్రీగా ఇస్తారా?

భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవిని వరించిన విషయం తెలిసిందే. కళారంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపునకు గాను మెగాస్టార్ కు ఈ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో తెలుగు ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఓ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే? పద్మ విభూషణ్ అవార్డుతో పాటుగా మెగాస్టార్ కు ఎలాంటి సదుపాయాలు ఉచితంగా లభిస్తాయి, అన్నదే ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. దేశంలోనే అత్యున్న రెండో పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కళా రంగంలో అందించిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ సత్కారం ప్రకటించింది. చిరూ తో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా ఈ అవార్డు వరించింది. అయితే ఈ అవార్డు పొందిన వారికి ఎలాంటి సౌక్యరాలు ఉంటాయి? ఎంత నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు? సౌకర్యాలు ఫ్రీగా వస్తాయా? అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

Padma Vibhushan Is all this free for Megastar

కాగా.. పద్మ అవార్డులు అనేవి ఓ గౌరవంగా మాత్రమే మనం గుర్తించాలి. పద్మ అవార్డులు వచ్చిన వ్యక్తులకు ఎలాంటి నగదు కానీ, రాయితీలు కానీ ఇవ్వరు. రైలు, విమాన ప్రయాణాల్లో కూడా ఎలాంటి రాయితీలు, ఉచితాలు ఉండవు. అయితే పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. ఇక ఈ అవార్డులు పొందిన వారికి రాష్ట్రపతి సంతకంతో ఉన్న ధృవీకరణ పత్రం, మెడల్ బహూకరిస్తారు. ఇదిలా ఉండగా.. సినీ రంగానికి చేసిన సేవలకుగానూ మెగాస్టార్ కు 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రధానం చేసింది. ఇక ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. కాగా.. మెగాస్టార్ 2006 సంవత్సరంలోనే సౌత్ ఫర్ హానరరీ యాక్టింగ్ కెరీర్ పేరిట ప్రత్యేక అవార్డును ఫిల్మ్ ఫేర్ వేడుకల్లో అందుకున్నాడు. వీటితో పాటుగో ఎన్నో పురస్కారాలను దక్కించుకున్నాడు మన మెగాస్టార్.

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş