iDreamPost

పిల్లలే ఈ దెయ్యం టార్గెట్.. OTTలో వెన్నులో వణుకుపుట్టించే హారర్ చిత్రం..

OTT Suggestions: ఓటీటీలో చాలానే హారర్ చిత్రాలు ఉంటాయి. కానీ, కొన్ని చూసిన తర్వాతే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిదే ఈ సినిమా కూడా.

OTT Suggestions: ఓటీటీలో చాలానే హారర్ చిత్రాలు ఉంటాయి. కానీ, కొన్ని చూసిన తర్వాతే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిదే ఈ సినిమా కూడా.

పిల్లలే ఈ దెయ్యం టార్గెట్.. OTTలో వెన్నులో వణుకుపుట్టించే హారర్ చిత్రం..

సినిమాలు చూసే వారిలో హారర్ సినిమాలు చూసేవాళ్లు వేరయా అనే నానుడి ఉందని మీకు తెలుసా? హారర్ సినిమాలు అంటే చాలామంది తప్పించుకుంటూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం అచ్చంగా హారర్ సినిమాలే చూస్తూ ఉంటారు. అలాంటి హారర్ సినిమాల లవర్స్ కి ఒక పట్టాని సినిమాలు నచ్చవు. వారికి నచ్చాలి అంటే మంచి కథ మాత్రమే కాదు.. అందులో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. అలాంటి సినిమాలు ఓటీటీలో చాలా తక్కువ ఉంటాయి. ఈ మూవీ ఆ కోవకు చెందిందే. నిజానికి ఈ మూవీ వచ్చి ఐదేళ్లు అయ్యింది. కానీ, ఒక మంచి థ్రిల్ ఇచ్చే హారర్ సినిమా అంటే ఈ మూవీని సజెస్ట్ చేయచ్చు. మరి.. ఆ మూవీ ఏది? ఎందుకంత స్పెషలో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న హారర్ సినిమా పేరు “ది కర్స్ ఆఫ్ లాయిరోనా”. ఇది 2019లోనే రిలీజే అయ్యింది. ఈ మూవీ కంప్లీట్ హారర్ చిత్రం. దీనిని 9 మిలియన్ డాలర్స్ తో నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 123.1 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఈ లాయిరోనా అనేది లాటిన్ అమెరికాలో ప్రముఖంగా వినిపించే మహిళా దెయ్యం పేరు. ఇది ఎంత ప్రాముఖ్యం అంటే ఆ ప్రాంతంలో దీని పేరు వింటే పిల్లలు వణికిపోతారు. అలాంటి ఒక కథను మంచి హారర్ చిత్రంగా తెరకెక్కించారు. దీనిని మైకేల్ ఛావ్స్ తెరకెక్కించాడు. అతని తొలి చిత్రాన్నే ఇంత అద్భుతంగా తెరకెక్కించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే కచ్చితంగా వణుకు పుడుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడకుండా ఆగిపోయిన వాళ్లు కూడా ఉన్నారంట. అయితే ఓవరాల్ గా మాత్రం ఇది మంచి క్రైమ్ థ్రిల్లర్. దీనిని కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేయచ్చు. అలాగే ఇందులో వెన్నులో వణుకుపుట్టించే సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. హారర్ జానర్ లవర్స్ కు కావాల్సిన చిల్లింగ్ థ్రిల్స్ ఈ సినిమాలో చాలానే ఉంటాయి. మైకేల్ చావ్స్ టేకింగ్ మెప్పిస్తుంది. హారర్ సినిమాకి కావాల్సింది బీజీఎం. అది ఇందులో ఆడియన్స్ తెగ మెప్పిస్తుంది. ఇంటెన్స్ సీన్స్ లో బీజీఎం వణికిపోయేలా చేస్తుంది.

ఈ లాయిరోనా దెయ్యం పెద్దవాళ్లని టార్గెట్ చేయదు. కేవలం పిల్లలను మాత్రమే పట్టుకుంటుంది. అలా పట్టుకున్న పిల్లలను ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. ఒక గ్రామం మొత్తం ఈ లాయిరోనా వల్ల బాధించబడుతూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న పిల్లలకు రక్షణ ఉండదు. ఎప్పుడు ఈ లాయిరోనా దెయ్యం వచ్చి పిల్లలను లాక్కెళుతుందో అని తల్లిదండ్రులు బిక్కు బిక్కుమంటూ బతుకూతూ ఉంటారు. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు ఎంతో గొప్పగా యాక్ట్ చేశారు. మొత్తానికి మీరు గను ఒక థ్రిల్లింగ్ హారర్ చిత్రం చూడాలి అనుకుంటే ఈ ది కర్స్ ఆఫ్ లాయిరోనా చూడచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి